For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్.. పృథ్వీషా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరు?

Prithvi Shaw: భారత ఓపెనర్ పృథ్వీ షా ఈ మధ్య క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో పృథ్వీ షాను ఎవరూ కొనుగోలు చేయలేదు. ఒకప్ఫుడు పృథ్వీ షాను భారత క్రికెట్ ఫ్యూచర్ అని పిలిచేవారు. 2018లో కేవలం 18 సంవత్సరాల వయస్సులో పృథ్వీ షా తన టెస్టు అరంగేట్రంలో సెంచరీ సాధించాడు. కానీ త్వరలోనే పృథ్వీ షా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. పృథ్వీ షా ముంబై దేశవాళీ జట్టు నుంచి కూడా తొలగించబడ్డాడు. కానీ ఇప్పుడు పృథ్వీ షా వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలిచాడు. పృథ్వీ షా జీవితంలోకి ఒక కొత్త అమ్మాయి వచ్చింది. పృథ్వీ షా ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టినరోజును కూడా జరిపాడు.

ఫోటో షేర్ చేసిన పృథ్వీ షా
పృథ్వీ షా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ పుట్టిన రోజును జరిపాడు. ఇటీవల పృథ్వీ శా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో పృథ్వీ షా ముంబైలోని ఒక రెస్టారెంట్ నుంచి ఒక అమ్మాయితో బయటకు వస్తున్నట్లు కనిపించాడు. ఆ అమ్మాయి పేరు ఆకృతి అగర్వాల్. ఆకృతి అగర్వాల్ ఒక నటి, ఫ్యాషన్ ఇన్‌‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్. వస్తున్న వార్తల ప్రకారం.. వారిద్దరూ ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆకృతి అగర్వాల్ వయస్సు 22 సంవత్సరాలు.

Prithvi Shaw Celebrates Birthday with Rumoured Girlfriend Aakriti Agarwal

ఈ సందర్భంగా పృథ్వీ షా ఆకృతి అగర్వాల్ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. పృథ్వీ షా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలో అతను ఆకృతి అగర్వాల్‌తో కలిసి పుట్టిన రోజు జరుపుకుంటున్నట్లు కనిపించాడు. పృథ్వీషా తన చేతులతో ఆకృతి అగర్వాల్‌కు కేక్ తినిపిస్తున్నాడు. ఈ ఫోటో షేర్ చేయడంతో పాటు 'పుట్టినరోజు శుభాకాంక్షలు ఆకృతి అగర్వాల్' అని రాశాడు. దానితో పాటు ఒక హార్ట్ ఎమోజీని కూడా పంచుకున్నాడు.

ఆకృతి అగర్వాల్ ఎవరు?
ఆకృతి అగర్వాల్ తెలుగు చిత్రం 'త్రిముఖ'సినిమాలో కూడా కనిపించనుంది. ఆకృతి అగర్వాల్‌కు 3.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కొంతకాలం క్రితం వరకు పృథ్వీ షా నటి నిధి తపారియాతో డేటింగ్‌లో ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో పృథ్వీకి మద్దతుగా నిధి తపారియా స్టేడియానికి వచ్చేది. నిధికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 12 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ సీజన్ లో ఆమె పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతు ఇస్తూ స్టేడియంలో కనిపించింది.

Story first published: Friday, May 2, 2025, 19:08 [IST]
Other articles published on May 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+