సచిన్‌కి కాకుండా ఆ రికార్డు పృథ్వీకే దక్కిందా?

రాజ్‌కోట్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలిటెస్టులో భారత ఓపెనర్ పృథ్వీ షా రికార్డుల మోత మోగించాడు. అరంగేట్ర టెస్టులో సెంచరీ బాదిన షా.. ఈ ఘనత సాధించిన 15వ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్ తరపున పిన్న వయసులో సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 99 బంతులు ఆడిన పృథ్వీ షా వన్డే తరహాలో సెంచరీ బాదేశాడు. ఈ సందర్భంగా ఎన్నో రికార్డులు అతని సొంతమైయ్యాయి.

విండీస్‌పై అరంగ్రేటంలోనే సెంచరీ:
18 ఏళ్ల పృథ్వీ షా తన తొలి టెస్టులోనే అద్భుత ఆటతీరుతో విండీస్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో 15 బౌండరీలు బాదాడు. అంతర్జాతీయంగా అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన నాలుగో పిన్న వయస్కుడిగా షా నిలిచాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే తొలి టెస్టులో వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

3ట్రోఫీల్లో సెంచరీలతో అరంగ్రేటం
వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో సెంచరీ సాధించిన పృథ్వీ... రంజీ, దులీప్ ట్రోఫీలతో పాటు టెస్టుల్లోనూ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్.. రంజీ, దులీప్ ట్రోఫీల్లో తన తొలి మ్యాచ్‌ల్లోనే సెంచరీ చేసినా.. టెస్టుల్లో మాత్రం శతకానికి 13 మ్యాచ్‌ల వరకు వేచి చూడాల్సి వచ్చింది. మరోవైపు టెస్టుల్లో భారత్ తరపున అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రెండో అతిపిన్న వయస్కుడిగానూ పృథ్వీ రికార్డు సృష్టించాడు.

సచిన్ తర్వాత... రెండో స్థానంలో
ప్రస్తుతం పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. భారత్ తరపున సచిన్ 17రోజుల 107 రోజుల్లో సెంచరీ చేశాడు. సచిన్ తర్వాత సెంచరీ సాధించిన రెండో అతిపిన్న వయస్కుడిగా షా రికార్డు సాధించాడు. ఈ కేటగిరిలో బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ అష్రఫుల్(17 ఏళ్ల 61 రోజులు) తొలిస్థానంలో ఉన్నాడు.

మ్యాచ్‌లో ఏకంగా 546 పరుగులు సాధించి
2013లో ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన హారిస్ షీల్డ్ టోర్నీలో రిజ్వి స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాల తరపున ఆడిన పృథ్వీ షా... సెయింట్ ఫ్రాన్సిస్ డియాస్సి పాఠశాలతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 546 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. పాఠశాల స్థాయిలో గుర్తింపు పొందిన టోర్నీలో 500 పరుగులు సాధించిన తొలి బాలుడిగా షా రికార్డు సృష్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications