
వారిద్దరూ ఇంగ్లాండ్‌కు
ఈ సిరీస్‌లో రాణిస్తోన్న పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను ప్రమోట్ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. వారిని సీనియర్ టీమిండియాలోకి బదిలీ చేసింది. ఇది రీప్లేసే అయినప్పటికీ.. ఇంగ్లాండ్ వంటి అత్యుత్తమ జట్టుపై ఏకంగా టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడే జట్టులో చోటు దక్కించుకోవడం మామూలు విషయం కాదు. పృథ్వీ షా ఇదివరకే టెస్టుల్లో డెబ్యూ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే తొలి టెస్ట్ సిరీస్ అవుతుంది. ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న భారత జట్టులో గాయాల బారిన పడిన ఇద్దరు క్రికెటర్ల స్థానంలో ఈ ఇద్దరినీ భర్తీ చేసింది బీసీసీఐ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది..కొద్దిసేపటి కిందటే.

గాయాలబారిన..
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డ విషయం తెలిసిందే. సిరీస్ మొత్తానికీ అతను అందుబాటులో ఉండట్లేదు. అదే సమయంలో స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ సైతం గాయలబారిన పడ్డాడు. సెలెక్ట్ కౌంట్ ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడుతూ వేలిని గాయపరచుకున్నాడు. ఫలితంగా అతణ్ని ఆరువారాల పాటు విశ్రాంతి కల్పించాలని ఫిజియోథెరపిస్ట్ సూచించారు. దీనితో అతను స్వదేశానికి తిరుగుముఖం పట్టనున్నాడు. వారిద్దరితో పాటు యంగ్ బౌలర్ అవేష్ ఖాన్ పరిస్థితీ దీనికి భిన్నంగా ఏమీ లేదు. అతను గాయాల దెబ్బను రుచి చూసిన వాడే. అజింక్య రహానే కూడా కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు.

నాడు తప్పించినా..
ఈ పరిస్థితుల్లో వారిని రీప్లేస్ చేయాలని నిర్ణయించింది బీసీసీఐ. గాయపడ్డ ప్లేయర్ల స్థానంలో పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను సెలెక్ట్ చేసింది. వచ్చే నెల 4వ తేదీన ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఆరంభం కాబోయే అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడబోయే విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా జట్టులో చేరనున్నారు. భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా సిరీస్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించకపోవడం వల్ల పృథ్వీ షాను టెస్ట్ జట్టు నుంచి తప్పించింది బీసీసీఐ. ఆ తరువాత డొమెస్టిక్ క్రికెట్‌లో అతను సత్తా చాటుకున్నాడు. శ్రీలంక సిరీస్‌లో ఫర్యాలేదనిపించుకుంటున్నాడు. దీనితో అతన్ని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసింది.

సెలెక్ట్ కమిటీ వారి పైపే..
శుభ్‌మన్ గిల్ స్థానంలో పృథ్వీ షా, అజింక్య రహానె స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బౌలింగ్ చేసే కుడి చేతి వేలికి గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్.. ప్రస్తుతం ఇంజెక్షన్లను తీసుకుంటున్నాడని, అతనికి మరింత విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంలో చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్ట్ కమిటీ పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్‌లను ఇంగ్లాండ్‌కు పంపించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు మార్పులతో చేసిన తాజా టెస్ట్ జట్టును బీసీసీఐ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది.
కొత్త జట్టు ఇదీ..
రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కేప్టెన్), అజింక్య రహానె (వైస్ కేప్టెన్), హనుమ విహారి, రిషభ్ పంత్, (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్. కాగా స్టాండ్ బై ప్లేయర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ, అర్జాన్ నగ్వాస్‌వాలా వ్యవహరిస్తారు.


Click it and Unblock the Notifications












