Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ సెలెక్టర్లను టార్గెట్ చేసిన పృథ్వీ షా.. వైరల్ అవుతున్న వీడియో!

టీమిండియా యంగ్ సెన్సేషన్ పృథ్వీ షా మరోసారి సెలెక్టర్లపై పరోక్షంగా చురకలేశాడు. 2021లో శ్రీలంకపై ఓకే ఒక టీ20 మ్యాచ్ ఆడిన అతను.. గతేడాది ఐపీఎల్ లో అధ్భుతంగా రాణించాడు. దీంతో అతన్ని కివీస్ తో టీ20లకు ఎంపిక చేశారు. ఈ సిరీసులో అతను ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు.

అయితే ఈ ఏడాది పృథ్వీ షా అంత గొప్ప ఫామ్ లో కూడా లేదు. ముఖ్యంగా ఐపీఎల్ లో అత్యంత ఘోరంగా విఫలం అయ్యాడు. ఆ తర్వాత దేశవాళీ మ్యాచుల్లో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా రాణించలేదు. అయితే తనను టీమిండియా నుంచి ఎందుకు తప్పించారో తెలియడం లేదని, ఎవరూ తనకు ఎలాంటి కారణం చెప్పలేదని ఇటీవల షా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Prithvi Shaw

ఇలా తనను కారణం లేకుండా పక్కన పెట్టేయడం షాకు ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా విండీస్ తో టీ20లకు అతన్ని సెలెక్ట్ చేయకపోవడంపై షా అసహనంగా ఉన్నాడు. అదే సమయంలో ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో కూడా తన పేరు లేకపోవడం అతనికి గట్టి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సెలక్టర్లకు చురకలేసేలా ఒక వీడియో షేర్ చేసాడీ ముంబై బ్యాటర్.

ముంబైలో ప్రస్తుతం భారీగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఇంత భారీ వర్షాల్లో కూడా వానలో తడుస్తూ పృథ్వీ షా తన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను షా తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Prithvi Shaw

కొందరు అతని డెడికేషన్ ను మెచ్చుకుంటున్నారు. మరికొందరేమో ఇది మరీ అతిగా ఉందని, షా కేవలం అటెన్షన్ కోసమే ఈ వీడియో షూట్ చేసినట్లు ఉందని అంటున్నారు. ఏదేమైనా.. తనకు టీమిండియాలో చోటు దక్కక పోవడంపై మాత్రం పృథ్వీ షా చాలా అసంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

Story first published: Thursday, July 27, 2023, 17:45 [IST]
Other articles published on Jul 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+