
హైదరాబాద్: పృథ్వీ షా... ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎదుగుతోన్న క్రికెటర్. ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత యువ జట్టుకు కెప్టెన్‌గా సారథ్యం వహిస్తున్నాడు.
ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో పృథ్వీ షా (94) పరుగులు చేయగా, పాపువా న్యూ గినియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో 39 బంతుల్లో 67 పరుగులు చేశాడు.
పృథ్వీ షా బ్యాటింగ్ శైలి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను పోలి ఉండటంతో న్యూజిలాండ్‌లో అతడికి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఎంతలా అంటే టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికా-వెస్టిండిస్ జట్లు బుధవారం తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు పృథ్వీ షా స్టేడియానికి వచ్చాడు.
ఈ మ్యాచ్‌ని చూసేందుకు వచ్చిన ఓ ఫ్యామిలీ తన కుమారుడితో ఫోటో దిగాల్సిందిగా పృథ్వీ షాని కోరారు. దీంతో ఆ కుటుంబం కోరిక మేరకు పృథ్వీ షా ఆ బాలుడిని తన చేతులతో ఎత్తుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.