Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్‌పై పత్రికల ప్రింట్ పొరపాటు, హ్యూస్‌పై ఫ్యాన్స్.. (పిక్చర్స్)

న్యూఢిల్లీ/సిడ్నీ: ఆసీస్ యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మృతి పైన క్రికెట్ క్రీడా ప్రపంచం తమ సంతాపాన్ని తెలిపింది. భారతరత్న, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. అయితే, సచిన్ సంతాపాన్ని పేర్కొనే క్రమంలో పలు పత్రికలు ప్రింటింగ్‌లో పొరపాటు చేశాయి. ఆర్ఐపీ (రెస్ట్ ఇన్ పీస్) హ్యూస్‌కు బదులు ఆర్ఐపీ సచిన్ టెండుల్కర్ అని రాశాయి.

Print blunder:

హ్యూస్ మృతి పైన సచిన్ టెండుల్కర్ గురువారం స్పందిస్తూ.. అతని మరణాన్ని 'క్రికెట్ బాధాకరమైన రోజు'గా అభివర్ణించాడు. సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో ఫిలిప్ హ్యూస్ మరణం బాధాకరం. క్రికెట్‌కు బాధాకరమైన రోజు. అతని ఫ్యామిలీ, స్నేహితులు మంచి కోరుకునే వారికి తన సంతాపాన్ని తెలిపాడు.

Print blunder: "RIP Sachin Tendulkar", says newspaper

హ్యూస్ మృతి నేపథ్యంలో క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా షాకయ్యారు. హ్యూస్ మృతి పైన అభిమానులు సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో స్పందిస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా క్లబ్స్‌కు, పాఠశాలలకు లేఖ రాసింది. హ్యూస్‌కు నివాళులు అర్పించాలని పేర్కొంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+