హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌ను కైవసం చేసుకుంది. ఇక మిగిలింది ఏకైక టీ20నే. వెస్టిండిస్, భారత్ జట్ల మధ్య కింగ్ స్టన్ వేదికగా ఏకైక టీ20 ఆదివారం (జులై 9)న జరగనుంది. ఈ ఏకైక టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐదు వన్డేల సిరిస్‌ను 3-1తో సొంతం చేసుకున్న టీమిండియా ఏకైక టీ20లో కూడా విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు గాయాల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెత్త ప్రదర్శన చేసిన క్రిస్ గేల్ కూడా విండిస్ తరుపున ఏకైక టీ20లో బరిలోకి దిగుతున్నాడు.

ఈ నేపథ్యంలో విండిస్‌తో జరిగే ఏకైక టీ20 మ్యాచ్‌లో కోహ్లీ ఓపెనింగ్‌కు దిగి భారీగా పరుగులు రాబట్టాలనే నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కోహ్లీకి తోడుగా మరో ఓపెనర్‌గా రహానే లేదా ధావన్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
వెస్టిండిస్ పర్యటనకు ఎంపికైనప్పటికీ ఐదు వన్డేల సిరిస్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేని యువ ఆటగాడు రిషబ్‌పంత్ టీ20 తుది జట్టులోనైనా అవకాశం దక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. మరోవైపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కూ చోటు దక్కే అవకాశం ఉంది.
జట్ల వివరాలు:
ఇండియా:
Virat Kohli (captain), Shikhar Dhawan, Rishabh Pant, Ajinkya Rahane, Mahendra Singh Dhoni (wicketkeeper), Yuvraj Singh, Kedar Jadhav, Hardik Pandya, Ravichandran Ashwin, Ravindra Jadeja, Mohammed Shami, Umesh Yadav, Bhuvneshwar Kumar, Kuldeep Yadav, Dinesh Karthik.
వెస్టిండిస్:
Carlos Brathwaite (captain), Samuel Badree, Ronsford Beaton, Chris Gayle, Evin Lewis, Jason Mohammed, Sunil Narine, Kieron Pollard, Rovman Powell, Marlon Samuels, Jerome Taylor, Chadwick Walton (wicketkeeper), Kesrick Williams.
మ్యాచ్ ప్రారంభం 9 PM IST
టెన్ స్పోర్ట్స్, సోనీ సిక్సులో ప్రసారం