Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ Vs రైనా: 13 పరుగుల దూరంలో రైనా, 2 సార్లు గుజరాత్‌దే పైచేయి

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచిన గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా జట్టుతో సురేశ్ రైనా నేతృత్వంలోని గుజరాత్ లయన్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో జరగనుంది.

గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్ లయన్స్ జట్టు మెరుగ్గానే రాణించినప్పటికీ, ఈసారి ఎలాగైనా సరే ఛాంపియన్స్‌గా అవతరించాలనే పట్టుదలతో ఉంది. రైనా సారథ్యంలోని గుజరాత్‌ లయన్స్‌ జట్టు 2016 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మొత్తం 14మ్యాచ్‌లో 9 మ్యాచ్‌లు గెలిచి 18పాయింట్లతో ప్లే ఆఫ్‌కి అర్హత సాధించింది. ఎన్నో ఆశలతో ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టిన గుజరాత్‌ లయన్స్‌ మొదటి క్వాలిఫయర్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత క్వాలిఫయర్‌-2లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడింది.

అందరి కళ్లు బసిల్ తంపీపైనే

అందరి కళ్లు బసిల్ తంపీపైనే

ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బసిల్ తంపీని పైనే అందరి కళ్లు ఉన్నాయి. మరోవైపు గుజరాత్ జట్టుని గాయలు వేధిస్తున్నాయి. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు అయిన డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా ఐపీఎల్ 10వ సీజన్ లీగ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. టీ20 ఫార్మెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో మోచేతి గాయం కారణంగా లీగ్‌కు దూరం కాగా, చేతి వేలు గాయం కారణంగా రవీంద్ర జడేజా 10వ సీజన్‌ను మిస్సయ్యాడు.

రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా

రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా

ఇక కోల్‌కతా విషయానికి వస్తే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 10వ సీజన్‌లో కూడా సత్తా చాటాలని ఊవిళ్లూరుతుంది. గతేడాది ప్లేఆఫ్స్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలై కోల్ కతా ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. అయితే నిషేధం కారణంగా వెస్టిండిస్ ఆటగాడు ఆండ్రూ రెస్సెల్ ఈ సీజన్‌కు దూరమైన అతడి స్ధానంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కోలిన్ డీ గ్రాండ్ హోమ్ జట్టుకు అదనపు బలం. ఇక కోల్ కతా బౌలింగ్ విషయానికి వస్తే పటిష్టంగా ఉంది.

అరుదైన రికార్డుకి చేరువలో రైనా

అరుదైన రికార్డుకి చేరువలో రైనా

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్లు క్రిస్ వోక్స్, ట్రెంట్ బౌల్ట్‌లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ జట్టు కెప్టెన్ సురేశ్ రైనా ఓ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా 13 పరుగులు చేస్తే ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ (4098) అత్యధిక పరుగుల రికార్డుని అధిగమిస్తాడు. ఇక ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరులో గుజరాత్ లయన్స్‌దే పైచేయి. ఇరు జట్లు ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించింది.

ఐపీఎల్: మ్యాచ్ 3

ఐపీఎల్: మ్యాచ్ 3

07 ఏప్రిల్ 2017, సాయంత్రం 8 గంటలకు

ఎక్కడ

సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, రాజ్‌కోట్

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+