For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రివ్యూ: ఈ సిరీస్ గెలవాలని పాతికేళ్లుగా పోరాడుతూనే ఉన్నాం

Preview, Ist Test: India bank on collective strength against SA

హైదరాబాద్: కొన్నెళ్లుగా భారత జట్టు తిరుగులేనిదిగా దూసుకుపోతోంది. వరుసగా తొమ్మిది సిరీస్‌లను గెలుచుకుని సమరోత్సాహంతో ఉన్న ఈ జట్టు మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో ఆడనుంది.

ఈ సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్‌కు గురైనా భారత్‌ టాప్‌ ర్యాంకుకు వచ్చిన ముప్పేమీ ఉండబోదు. కాకపోతే ఈ సిరీస్‌ ద్వారా తమపై ఉన్న అంచనాలను అందుకోవాల్సిన ఒత్తిడితో బరిలోకి దిగనుంది. ముందుగా ఇక్కడి బౌన్సీ పిచ్‌లపై బుల్లెట్‌లా దూసుకువచ్చే బంతులను టీమిండి యా బ్యాట్స్‌మెన్‌ సమర్థవంతంగా ఎదుర్కొనాల్సి ఉంది.

భారత్‌ చివరిగా గెలిచిన తొమ్మిది సిరీస్‌లలో ఆరు స్వదేశంలోనే సాధించింది. రెండు శ్రీలంకలో, ఒకటి విండీస్‌లో నెగ్గింది. అయితే ఆ జట్లు బలహీనంగా ఉండడంతో ఇప్పుడు ప్రొటీస్‌ పై ఆటే వారికి అసలు సిసలు సవాల్‌ కానుంది. తమ చివరి పర్యటనలో ఉన్న 13 మంది ఆట గాళ్లు ప్రస్తుత టీమ్‌లోనూ ఉన్నారు. ఇప్పుడు వా రంతా అపార అనుభవం కలిగి ఉండడంతో ఈ సారి పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. ఇక న్యూలాండ్స్‌ మైదానంలో భారత్‌ ఆడిన 4 టెస్టుల్లో రెండు ఓడి, రెండు డ్రా చేసుకుంది.

అదనపు పేస్‌, బౌన్స్‌ ఎదురయ్యే ఇక్కడి పిచ్‌లపై కోహ్లీ, రహానే, పుజారా, విజయ్‌, రోహిత్‌, ధావన్‌లు తమ బ్యాటింగ్‌తో జట్టును నిలబెట్టాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ధావన్‌ ఫిట్‌గా ఉన్నట్టు తేలడంతో మురళీ విజయ్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయడం దాదాపు ఖాయమే. రోహిత్‌ సూపర్‌ ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే పోటీలో ఉన్నట్టే. మరోవైపు పుజారా బ్యాటింగ్‌ ఈ సిరీస్‌లో కీలకం కానుంది. జడేజాకు వైరల్‌ జ్వరం కారణంగా జట్టులో ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌కు చోటు దక్కింది. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగేందుకు జట్టు మొగ్గు చూపుతోంది. అదే జరిగితే భువనేశ్వర్‌, షమి, ఇషాంత్‌ జట్టులో ఉండనున్నారు.

రహానేకు చోటు దక్కకపోవచ్చు..
అదనపు బౌలర్‌గా హార్దిక్‌ పాండ్యా.. ఫామ్‌లో ఉన్న రోహి త్‌ శర్మకు తుది జట్టులో చోటు కల్పించే ఆలోచనలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఉండడంతో అ జింక్యా రహానెకు తొలి టెస్టులో బెర్త్‌ కష్టంగానే మారింది. బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ఈమేరకు సూచన ప్రాయంగా తెలిపాడు. రోహిత్‌ ఫామ్‌లో ఉండడంతో అతడినే ఆడించే అవకాశం ఉందని చె ప్పాడు. కానీ రహానేకు విదే శీ గడ్డపై మెరుగైన రికార్డే ఉంది.

కోహ్లీ గైర్హాజరు
తొలి టెస్టు ప్రారంభానికి ఒక రోజు ముందు భారత జట్టు విశ్రాంతికే పరిమితమైంది. ప్రాక్టీస్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్షనల్‌గా ప్రకటించడంతో ఒక్కరు కూడా సెషన్‌లో పాల్గొనలేదు. ఇక సిరీస్‌కు ముందు జరిగే ప్రెస్‌ మీట్‌కు సైతం కెప్టెన్‌ కోహ్లీ డుమ్మా కొట్టడం ఆశ్చర్యప రిచింది. అతడి స్థానంలో సహాయ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వచ్చాడు.

పోరాటంపై ప్రత్యర్థుల ధీమా:
ఈ సిరీస్‌పై దక్షిణాఫ్రికా జట్టు భరోసాతో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే భారత్‌లాగే వీరు తుది జట్టు కూర్పుపై మల్లగుల్లాలు పడుతు న్నారు. వికెట్‌ కీపర్‌ డికాక్‌ గాయం నుంచి కోలుకున్నాడు. జింబాబ్వేతో టెస్టుకు డుప్లెసిస్‌ దూరం కావడంతో డివిలియర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు రెగ్యూలర్ కెప్టెన్‌ ఫిట్‌గా ఉండడంతో డివిలియర్స్ టెంబా మధ్య పోటీ నెలకొంది.

ఇక స్టెయిన్‌ తొలి టెస్టుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ బెర్త్‌పై స్పష్టత లేదు. రబాడ, ఫిలాండర్‌, మోర్కెల్‌, స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌లను ఆడించాలని చూస్తోంది.


ఇరు జట్లు (అంచనా)
భారత్‌: విజయ్‌, ధవన్‌/రాహుల్‌, పుజారా, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, రోహిత్‌/ పాండ్యా, సాహా, అశ్విన్‌, భువనేశ్వర్‌, ఇషాంత్‌, షమి.

దక్షిణాఫ్రికా: ఎల్గర్‌, మర్‌క్రామ్‌, ఆమ్లా, డుప్లెసిస్‌ (కెప్టెన్‌), డివిల్లీర్స్‌/టెంబా, డి కాక్‌, ఫెహ్లుక్వాయో/మోరిస్‌, ఫిలాండర్‌, రబాడ, స్టెయిన్‌/మోర్కెల్‌, కేశవ్‌ మహరాజ్‌.

మైదానం వాతావరణం

నీటి ఎద్దడి కారణంగా పిచ్‌పై పచ్చికను పెంచేందుకు ఇబ్బంది ఎదురైంది. దీంతో బౌన్సీ ట్రాక్‌ కాకుండా ఈసారి ఫ్లాట్‌ పిచ్‌ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన 54 టెస్టుల్లో 44 సార్లు టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి, నాలుగో రోజు చిరుజల్లులకు ఆస్కారముంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 5, 2018, 13:51 [IST]
Other articles published on Jan 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+