డర్బన్‌లో తొలి వన్డే: కోహ్లీసేన చరిత్ర సృష్టిస్తుందా?
హైదరాబాద్: సఫారీ గడ్డపై ద్వైపాక్షిక సిరిస్ టీమిండియాకు అందని ద్రాక్షగానే మిగిలింది. టెస్టు సిరిసే కాదు, వన్డే సిరిస్‌ను సైతం భారత జట్టు ఇప్పటివరకు గెలవలేకపోయింది. 25 ఏళ్లుగా సఫారీ పర్యటనకు వెళ్తోన్న భారత జట్టు రిక్తహస్తాలతోనే తిరిగి వస్తోంది.
ఈ నేపథ్యంలో ఎన్నో ఆశలతో సఫారీ గడ్డపై అడుగుపెట్టిన కోహ్లీసేన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-2తో చేజార్చుకుంది. టెస్టు సిరిస్ అనంతరం ఇప్పుడు ఆరు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో తొలి వన్డే జరగనుంది.
Galvanised by the consolatory win in the final Test, India will be aiming for their first bilateral ODI series triumph on South African soil when they take on the Proteas in a six-match series, starting here on Thursday (February 1).

డర్బన్‌లో ఒక్క మ్యాచ్ గెలవని టీమిండియా
తొలి వన్డే జరిగే వేదికలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 1992 నుంచి డర్బన్‌లో సఫారీలతో ఆడిన ఏడు వన్డేల్లో టీమిండియా ఆరింట్లో ఓడింది. ఒక మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా ఫలితం తేలలేదు. అయితే ఇదే స్టేడియంలో 2003 వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్, కెన్యాలపై విజయం సాధించింది. ఇప్పుడు ఆ చరిత్రను తిరిగరాసే అవకాశం కోహ్లీసేనకు వచ్చింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోల్పోయినప్పటికీ, జోహెన్స్ బర్గ్‌లోని వాండరర్స్ పిచ్‌పై మూడో టెస్ట్ గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల సిరిస్‌ను విజయంతో మొదలుపెట్టాలని చూస్తోంది.

నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్ ఓటమి
టీమిండియా ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఆడిన నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఓటమిపాలైంది. ఇందులో రెండు సార్లు దక్షిణాఫ్రికా టీమిండియాను వైట్ వాష్ చేసింది. అయితే ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా పటిష్టంగా ఉండటంతో ఈసారి సఫారీలకు వైట్ వాష్ చేసే అవకాశం రాదని క్రికెట్ అభిమానుల అంచనా. 1992-93 సిరీస్‌లో 5-2తో, 2006-07లో 4-0తో, 2010-11లో 3-2తో, 2013-14లో 2-0తో దక్షిణాఫ్రికా సిరిస్‌లను నెగ్గింది. ఇక, 1996, 2001లలో జరిగిన రెండు ముక్కోణపు సిరిస్‌లలో కూడా టీమిండియా ఆడింది.

ముక్కోణపు సిరిస్‌లో సైతం భారత్ ఓటమి
ఈ రెండు ముక్కోణపు సిరిస్‌లలో ఒకదాంట్లో జింబాబ్వే, మరోదాంట్లో కెన్యా ఆడాయి. అయితే ఈ రెండు ముక్కోణపు సిరిస్‌లను దక్షిణాఫ్రికానే గెలుచుకోవడం విశేషం. గత 25 ఏళ్లలో సఫారీ గడ్డపై భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య 28 వన్డేలు జరగ్గా అందులో 21 వన్డేల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. అంతేకాదు జనవరి, 2016 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికా మొత్తం 19 వన్డేలు ఆడింది. ఇందులో 17 వన్డేల్లో విజయం సాధించగా, కేవలం రెండింట్లో మాత్రమే ఓటమిపాలైంది.

వరుసగా 17 విజయాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా
ఈ క్రమంలో ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లను దక్షిణాఫ్రికా వైట్ వాష్ చేసింది. దక్షిణాఫ్రికా చివరిసారిగా ఫిబ్రవరి 6, 2016న సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా 17 విజయాలను సాధించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి వన్డేలో కోహ్లీసేన ఏ మేరకు రాణిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరం కావడం ఒక్కటే టీమిండియాకు కలిసొచ్చే అంశం.

జట్ల వివరాలు:
టీమిండియా: Virat Kohli (captain), Rohit Sharma (vice-captain), Shikhar Dhawan, Ajinkya Rahane, Shreyas Iyer, Manish Pandey, Kedar Jadhav, Dinesh Karthik (wicketkeeper), MS Dhoni (wicketkeeper), Hardik Pandya, Axar Patel, Kuldeep Yadav, Yuzvendra Chahal, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Mohammed Shami, Shardul Thakur.
దక్షిణాఫ్రికా: Faf du Plessis (captain), Hashim Amla, Quinton de Kock (wicketkeeper), JP Duminy, Imran Tahir, Aiden Markram, David Miller, Morne Morkel, Chris Morris, Lungi Ngidi, Andile Phehlukwayo, Kagiso Rabada, Tabraiz Shamsi, Khaya Zondo.
Match starts at 4.30 PM IST (1 PM Local, 11 AM GMT)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications