న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గెలుపు దిశ‌గా ధ‌ర్మ‌శాలకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న రోహిత్ సేన

Preview: Ist ODI: India aim to start strongly against SL

హైద‌రాబాద్‌: రోహిత్ శ‌ర్మ జ‌ట్టు కెప్టెన్‌గా టీమిండియా జ‌ట్టు త‌యారైంది. కోచ్ ర‌విశాస్త్రి స‌హ‌కారంతో జ‌ట్టు ఖ‌చ్చితంగా గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. రేపు డిసెంబ‌ర్ 10 ఆదివారం ధ‌ర్మ‌శాలలో భార‌త్-శ్రీలంక‌ల మ‌ధ్య వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో జ‌ట్టు ఖ‌రారు కాగా ప్రాక్టీస్ నుంచే చాలా ప‌ట్టుద‌ల‌గా క‌నిపిస్తుంది.

జ‌ట్టులో రోహిత్, ర‌హానే, దినేశ్ కార్తీక్‌, ఎంఎస్ ధోనీ, కేద‌ర్ జాద‌వ్ దిగ్గ‌జాలు వారి స‌త్తాని చూపిస్తే మ్యాచ్ గెల‌వ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్‌ ఖాతాలో కూడా 120 పాయింట్లు ఉన్నప్పటికీ కొద్దిపాటి వ్యత్యాసం కారణంగా దక్షిణాఫ్రికానే నంబర్‌వన్‌గా ఉంది. ఆదివారం నుంచి శ్రీలంకతో జ‌రిగే మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.

సుదీర్ఘకాలం పాటు నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగాలంటే భారత్‌ 3-0తో సిరీస్‌ గెలవాలి. 2-1తో భారత్‌ సిరీస్‌ గెలిచినా 119 పాయింట్లతో యథావిధి రెండో స్థానంలోనే కొనసాగుతుంది. ఫిబ్రవరిలో భారత్‌.. దక్షిణాఫ్రికాతో 6 వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌తో ఎలాగైనా ర్యాంకులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలంక 83 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.

ఆడ‌నున్న జ‌ట్లు:
భార‌త్‌: రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్‌), శిఖ‌ర్ ధావ‌న్‌, అజింకా ర‌హానే, శ్రేయాస్ అయ్య‌ర్‌, మ‌నీశ్ పాండే, కేద‌ర్ జాద‌వ్‌, దినేశ్ కార్తీక్‌, ఎంఎస్ ధోనీ(వికెట్ కీప‌ర్‌), హ‌ర్ధిక్ పాండ్యా, అక్స‌ర్ ప‌టేల్‌, కుల్‌దీప్ యాద‌వ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, జాస్ప్రిత్ బుమ్రా, భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌, సిద్దార్థ్ కౌర్‌

శ్రీలంక‌: తిసారా పెరేరా (కెప్టెన్‌), ఉప్ప‌ల్ త‌రంగ‌, ద‌నుష్క గుణ‌తిల‌క‌, లాహిరు తిరిమ‌న్నె, ఏంజి మాథ్యూస్‌, గుణ‌ర‌త్నె, నిరోషాన్ దిక్వెల్లా, చ‌తురంగ దె సెల్వా, అకిలా ద‌నంజ‌య‌, సురంగ ల‌క్మ‌ల్‌, నువాన్ ప్ర‌దీప్‌, స‌దీరా స‌మ‌ర‌విక్ర‌మం, ధ‌నంజ‌య దే సెల్వా, దుష్మంత చ‌మీరా, స‌చిత్ ప‌తిరానా, కుస‌ల్ పెరేరా

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 9, 2017, 17:31 [IST]
Other articles published on Dec 9, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X