For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాక్స్‌వెల్ Vs వాట్సన్: చరిత్ర సృష్టించేందుకు 25 పరుగులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 10) రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ తలపడుతుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 10) రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ తలపడుతుంది. ఐపీఎల్ 10వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

ఈ సీజన్‌లో బెంగళూరు జట్టుని గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే ఆ జట్టు కీలక ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ కొన్ని మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికే దూరయ్యాడు. ఈ నేపథ్యంలో గెలుపు కోసం బెంగళూరు జట్టు పరితపిస్తోంది.

సోమవారం జరిగే మ్యాచ్‌కు కూడా కోహ్లీ దూరం కానున్నాడు. కోహ్లీ ఫిట్‌నెస్‌కు సంబంధించిన పూర్తి సమచారాన్ని బీసీసీఐ ఏప్రిల్ 2వ వారంలో ఓ నివేదికను విడుదల చేసింది. ఐపీఎల్ 10వ సీజన్‌లో రెండో వారం నుంచి కోహ్లీ అందుబాటులో ఉండొచ్చని ఆ నివేదికలో పేర్కొంది.

Preview: IPL 2017: Match 8: Punjab Vs Bangalore on April 10

మరోవైపు సోమవారం నాటి మ్యాచ్‌కి కూడా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డివిలియర్స్ ఫిట్‌నెస్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోవడమే పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక బెంగళూరు సొంత మైదానం చిన్నసామిలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కెప్టెన్ షేన్ వాట్సన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఇదే బెంగళూరుకు ఈ టోర్నీలొ తొలి విజయం. సోమవారం పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్ మూడోది. ఇక పంజాబ్ విషయానికి వస్తే ఓపెనింగ్ మ్యాచ్‌లో పూణెపై విజయం సాధించి మంచి జోరు మీదుంది. ఇప్పటికే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌, కేదార్‌ జాదవ్‌, షేన్‌ వాట్సన్‌లతో జట్టు పటిష్టంగా ఉంది. అయితే గేల్‌ ఫాం మాత్రం బెంగళూరును కలవరపెడుతుంది. గేల్‌ జరిగిన రెండు మ్యాచ్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేక పోయాడు. బౌలింగ్‌లో యజువేంద్ర చాహాల్‌, తైమిల్‌ మిల్స్‌, బిల్లీ స్టేన్‌లేక్‌లతో బైలింగ్‌ లైనప్‌ పర్వాలేదనిపిస్తోంది. క్రిస్‌గేల్‌ మరో 25 పరుగులు చేస్తే టీ20 చరిత్రలో పదివేల పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించనున్నాడు.

కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పూణెతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. బెంగళూరుపై అదే ఫామ్‌ని కొనసాగించనున్నాడు. మొహాలి తర్వాత పంజాబ్ రెండో సొంత మైదానమైన ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌ను పంజాబ్ ఘనంగా ప్రారంభించింది. ఈ ఏడాది నిర్వహించిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ ప్రాంఛైజీ ఇయాన్ మోర్గాన్, డారెన్ సమీ, మార్టిన్ గుప్టిల్, వరున్ ఆరోన్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: Shane Watson (captain), Chris Gayle, Mandeep Singh, Kedar Jadhav (wicketkeeper), Travis Head, Sachin Baby, Stuart Binny, Tymal Mills, Sreenath Aravind, Aniket Choudhary, Yuzvendra Chahal, Pawan Negi, Harshal Patel, Adam Milne, Iqbal Abdulla, Samuel Badree, Avesh Khan, Tabraiz Shamsi, Praveen Dubey, Billy Stanlake.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: Glenn Maxwell (captain), David Miller, Manan Vohra, Hashim Amla, Shaun Marsh, Armaan Jaffer, Martin Guptill, Eoin Morgan, Rinku Singh, Sandeep Sharma, Arman Jaffer, Anureet Singh, Mohit Sharma, KC Cariappa, Pradeep Sahu, Swapnil Singh, T Natrajan, Matt Henry, Varun Aaron, Axar Patel, Marcus Stoinis, Gurkeerat Mann, Rahul Tewatia, Darren Sammy, Wriddhiman Saha, Nikhil Naik, Ishant Sharma.

మ్యాచ్ ప్రారంభం సాయంత్రం 8 గంటలకు - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN
మంగళవారం (ఏప్రిల్ 11) మ్యాచ్ - Pune Vs Delhi in Pune (8 PM IST)
పంజాబ్ తదుపరి మ్యాచ్ - Vs Kolkata on April 13 (Thursday) - Kolkata (8 PM IST)
బెంగళూరు తదుపరి మ్యాచ్ - Vs Mumbai on April 14 (Friday) - Bengaluru (4 PM IST)

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+