ఐపీఎల్‌లో కీలక మ్యాచ్: పంజాబ్ గెలిస్తే సన్‌రైజర్స్‌కు ముప్పు
హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో లీగ్ దశ మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చాయి. దీంతో లీగ్ స్టేజిలో పదో సీజన్‌ను కీలక మలుపు తిప్పే కీలక మ్యాచ్ మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య గురువారం వాంఖడే స్టేడియం వేదిక జరగనుంది.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్ చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓడిపోతే, ప్లే ఆఫ్‌కు ఏయే జట్లు వెళ్తాయో తేలిపోతుంది. ఈ మ్యాచ్ ఫలితం నాలుగు జట్ల భవితవ్యాన్ని నిర్దేశిస్తుండటంతో ఆసక్తికరంగా మారింది.

18 పాయింట్లతో అగ్రస్థానంలో ముంబై
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నిలుస్తుంది. ప్రస్తుతం 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ 20 పాయింట్లతో నెంబర్ వన్ స్ధానాన్ని కైవసం చేసుకుంటుంది. అంటే ప్లేఆఫ్‌లో తొలి క్వాలిఫయర్‌లో ఓడినా ముంబైకి మరో అవకాశం ఉంటుంది.

పంజాబ్ గెలిస్తే సన్‌రైజర్స్ ముప్పు
ఇక ఒకవేళ పంజాబ్ జట్టు గెలిస్తే మాత్రం సన్‌రైజర్స్ ముందు చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఒకటి ఉంటుంది. శనివారం నాడు గుజరాత్ లయన్స్‌తో కాన్పూర్‌లో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుజరాత్‌పై సన్ రైజర్స్ విజయం సాధిస్తే ప్లేఆఫ్ స్థానం ఖరారవుతుంది.

గుజరాత్‌తో సన్ రైజర్స్ ఓడిపోతే
అలా కాకుండా గుజరాత్ జరిగే మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఓడిపోతే ఆదివారం నాడు పుణె జట్టుతో పంజాబ్ ఆడే మ్యాచ్ ఫలితం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి. ఆ మ్యాచ్‌లో పుణె గెలిస్తే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా పంజాబ్ గెలిస్తే మాత్రం (నేడు కూడా గెలిచి) హైదరాబాద్ జట్టు ఇంటిదారి పట్టినట్టే.

మిగతా మ్యాచ్‌లన్నీ నామమాత్రమే
ఇక లీగ్‌లో జరిగే మిగతా మ్యాచ్‌లన్నీ నామమాత్రమే. అయితే, ఈ మ్యాచ్‌తోనే టాప్-4 జట్ల స్థానాలు అటూ ఇటూ ఖరారయ్యే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 15 పాయింట్లతో వార్నర్ సేన నాలుగో స్థానంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications