
12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఆరు విజయాలు, ఐదు పరాజయాలు
ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఆరు విజయాలు, ఐదు పరాజయాలు నమోదు చేసింది. వర్షం కారణంగా బెంగళూరు మ్యాచ్ రద్దవడంతో మొత్తం 13 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతుంది. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు నమోదు చేయాల్సి ఉంది.

నాలుగు వికెట్లతో విజయం సాధించిన ముంబై
ఈ సీజన్ ఇప్పటికే ఇరుజట్లు పరస్పరం తలపడగా ముంబై నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి ప్రతీకారం తీర్చుకోవాలని వార్నర్‌సేన భావిస్తోంది. బ్యాటింగ్‌లో వార్నర్, ధావన్, యువీ, విలియమ్సన్ ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్ విషయానికొస్తే 21 వికెట్లతో టోర్నీలోనే భువనేశ్వర్ అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

ఆ రెండూ హైదరాబాద్ సొంతం
మరోవైపు అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ (డేవిడ్ వార్నర్)కు ఇచ్చే ‘ఆరెంజ్ క్యాప్', అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ (భువనేశ్వర్)కు ఇచ్చే పర్పుల్ క్యాప్‌లు రెండు హైదరాబాద్ సొంతమయ్యాయి. ఇక ఈ సీజన్‌లో అందరింకంటే ముందుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ ఘనత వహించింది.

11 మ్యాచ్‌లాడిన ముంబై తొమ్మిది విజయాలు, రెండు పరాజయాలు
మొత్తంగా 11 మ్యాచ్‌లాడిన ముంబై తొమ్మిది విజయాలు, రెండు పరాజయాలు నమోదు చేసింది. దీంతో 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన ముంబై కీలకమైన నాకౌట్ సమరానికి ముందు జట్టు రిజర్వ్ బెంచ్ సత్తాను పరిశీలించాలనుకుంటోంది.

జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:
Rohit Sharma (captain), Lendl Simmons, Mitchel Johnsohn, Mitchell McClenghan, Nitish Rana, Parthiv Patel (wicketkeeper), Saurabh Tiwary, Shreyas Gopal, Tim Southee, Lasith Malinga, Krunal Pandya, Keiron Pollard, Ambati Rayudu, Asela Gunaratne, Harbhajan Singh, Hardik Pandya, Jagdish Suchith, Jaspreet Bumrah, Jos Buttler, Karn Sharma and Vinay Kumar.
సన్ రైజర్స్ హైదరాబాద్:
David Warner (captain), Tanmay Agarwal, Ricky Bhui, Bipul Sharma, Ben Cutting, Shikhar Dhawan, Eklavya Dwivedi, Moises Henriques, Deepak Hooda, Chris Jordan, Siddharth Kaul, Bhuvneshwar Kumar, Ben Laughlin, Abhimanyu Mithun, Mohammad Nabi, Mohammed Siraj, Mustafizur Rahman, Ashish Nehra, Naman Ojha (wicketkeeper), Rashid Khan, Vijay Shankar, Barinder Sran, Pravin Tambe, Kane Williamson and Yuvraj Singh.
మ్యాచ్ ప్రారంభం 8 PM IST - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN
హైదరాబాద్ తదుపరి మ్యాచ్ - Vs Gujarat in Kanpur on May 13 at 4 PM IST
ముంబై తదుపరి మ్యాచ్ - Vs Punjab in Mumbai on May 11 at 8 PM IST


Click it and Unblock the Notifications











