For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరువు కోసం పాకులాట!: బెంగళూరు గెలుస్తుందా?

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో విజయం సాధించి పంజాబ్ జట్టు మంచి ఊపు మీద ఉంది.

దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్ బరిలో నిలుచోవాలని యోచిస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లో ఎనిమిది ఓటములతో ప్లే ఆఫ్‌కు దూరమైన బెంగళూరు పరువు కోసం ఈ మ్యాచ్‌లో గెలవాలని భావిస్తోంది. ఐపీఎల్ పదో సీజన్ ఆరంభంలో తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్‌.. అనంతరం వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

ఆ తర్వాత పంజాబ్‌ ఆడిన చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సమష్టి విజయం సాధించింది. పంజాబ్‌ దెబ్బకు టోర్నీ చరిత్రలోనే ఢిల్లీ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లాడిన పంజాబ్‌ నాలుగింటిలో విజయం సాధించి, ఐదింటిలో ఓటమి పాలైంది.

దీంతో పట్టికలో ఎనిమిది పాయింట్లతో ఐదోస్థానంలో కొనసాగుతోంది. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే హషీమ్‌ ఆమ్లా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 63 సగటుతో 315 పరుగులు నమోదు చేశాడు. కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ 193 పరుగులతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.

11 వికెట్లతో సత్తా చాటిన సందీప్ శర్మ

11 వికెట్లతో సత్తా చాటిన సందీప్ శర్మ

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే సందీప్‌ శర్మ ఎనిమిది మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో సత్తాచాటాడు. అక్షర్‌ పటేల్‌ 10 వికెట్లతో రాణించగా, వరుణ్‌ ఆరోన్, మోహిత్‌ శర్మ ఫర్వాలేదనిపిస్తున్నారు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఈ రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో తేడాతో పంజాబ్‌ ఘన విజయం సాధించింది.

గతేడాది రన్నరప్

గతేడాది రన్నరప్

ఇక బెంగళూరు విషయానికి వస్తే గతేడాది అద్భుత ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఈసారి మాత్రం చెత్త ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది పరాజయాలను సొంతం చేసుకుని అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు దూరమైన తొలి జట్టుగా నిలిచింది.

రెండు మ్యాచ్‌ల్లో విజయం

రెండు మ్యాచ్‌ల్లో విజయం

మొత్తంగా చూస్తే ఈ సీజన్‌లో పదకొండు మ్యాచ్‌లాడిన బెంగళూరు కేవలం రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. బెంగళూరు చివరగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో ఒక్క పాయింట్‌ను సాధించింది.

ఆఖరి స్థానంలో

ఆఖరి స్థానంలో

దీంతో ఐదు పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన కోహ్లి, డివిలియర్స్, గేల్‌లాంటి ఆటగాళ్లున్నా బెంగళూరు మాత్రం ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. ప్లే ఆప్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఎలాగైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని ఆశిస్తోంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

Virat Kohli (captain), AB de Villiers, Chris Gayle, Yuzvendra Chahal, Harshal Patel, Mandeep Singh, Adam Milne, Vishnu Vinod (wicketkeeper), Sreenath Aravind, Kedar Jadhav (wicketkeeper), Shane Watson, Stuart Binny, Samuel Badree, Iqbal Abdulla, Travis Head, Sachin Baby, Avesh Khan, Tabraiz Shamsi, Tymal Mills, Aniket Chaudhary, Praveen Dubey, Billy Stanlake, Harpreet Singh.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:

Glenn Maxwell (captain), David Miller, Manan Vohra, Hashim Amla, Shaun Marsh, Darren Sammy, Wriddhiman Saha (wicketkeeper), Nikhil Naik, Ishant Sharma, Armaan Jaffer, Martin Guptill, Eoin Morgan, Rinku Singh, Sandeep Sharma, Arman Jaffer, Anureet Singh, Mohit Sharma, KC Cariappa, Pradeep Sahu, Swapnil Singh, T Natrajan, Matt Henry, Varun Aaron, Axar Patel, Marcus Stoinis, Gurkeerat Mann, Rahul Tewatia.

మ్యాచ్ ప్రారంభం: 8 PM IST - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN

శనివారం (May 6) మ్యాచ్‌లు:

Hyderabad Vs Pune in Hyderabad - 4 PM

Delhi Vs Mumbai in Delhi - 8 PM

బెంగళూరు తదుపరి మ్యాచ్ - Vs Kolkata in Bengaluru on May 7 (Sunday) 4 PM

పంజాబ్ తదుపరి మ్యాచ్ - Vs Gujarat in Mohali on May 7 - 8 PM

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+