Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీసేనకు చావో రేవో: చిన్నసామిలో గుజరాత్ గర్జిస్తుందా?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ లయన్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ ఇది. టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఇప్పటివరకు కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియగా, మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో బెంగళూరు ఐదు పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్‌లో సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన గుజరాత్‌ రెండు విజయాలతో పట్టికలో చివరి స్థానంలో ఉంది.

ప్రతీ మ్యాచ్‌లోనూ తప్పక గెలవాలి

ప్రతీ మ్యాచ్‌లోనూ తప్పక గెలవాలి

బెంగళూరు చేతిలో ఇంకా ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచి ప్రతీ మ్యాచ్‌లోనూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగైతేనే ఆ జట్టు నాకౌట్‌ రేసులో నిలుస్తుంది. గుజరాత్‌ లయన్స్‌పై విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌కు మంచి రికార్డు ఉంది. బెంగళూరు తిరిగి విజయాల బాట పట్టాలంటే ఈ ఇద్దరు గర్జించాల్సి ఉంటుంది.

పది వికెట్లతో అత్యుత్తమ బౌలర్‌గా

పది వికెట్లతో అత్యుత్తమ బౌలర్‌గా

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే బెంగళూరు సాదాసీదా కన్పిస్తోంది. స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ జట్టు తరఫున పది వికెట్లతో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. పవన్‌ నేగి, శామ్యూల్‌ బద్రీ చెరో ఆరు వికెట్లతో ఫర్వాలేదనిపిస్తున్నారు. శ్రీనాథ్‌ అరవింద్, స్టువర్ట్‌ బిన్నీ బంతితో సత్తా చాటాల్సిన అవసరం ఉంది.

తొలి గెలుపు బెంగళూరుదే

తొలి గెలుపు బెంగళూరుదే

మరోవైపు ఈ సీజన్‌లో ఇరుజట్లు పరస్పరం తలపడగా అందులో బెంగళూరు విజయం సాధించింది. గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన గుజరాత్‌ లయన్స్‌ టోర్నీలో మూడోస్థానంలో నిలిచింది. అయితే ఈసారి మాత్రం గుజరాత్‌ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. జట్టులో కెప్టెన్‌ సురేశ్‌ రైనా, బ్రెండన్‌ మెకల్లమ్‌ , దినేశ్‌ కార్తిక్‌ రాణిస్తున్నారు.

మూడు సార్లు కోహ్లీసేన విజయం

మూడు సార్లు కోహ్లీసేన విజయం

అయితే వీరికి ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి సరైన సహకారం అందడం లేదు. ఈ సీజన్‌లో తలపడ్డ తొలిమ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌ ఛేదించలేకపోయింది. ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో నాలుగు సార్లు తలపడగా మూడు సార్లు కోహ్లీసేనే విజయం సాధించింది. గుజరాత్ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో గుజరాత్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను గుజరాత్‌ జట్టులోకి తీసుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+