For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గాడిలో పడతారా?: స్మిత్ దూరం, ఫామ్‌లేని ధోని

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. రెండు పరాజయాల తర్వాత గాడిలో పడిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్‌లో కూ

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌తో డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనుంది. రెండు పరాజయాల తర్వాత గాడిలో పడిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్‌లో కూడా జోరుని కొనసాగించాలని భావిస్తోంది.

మరోవైపు హ్యాట్రిక్ పరాజయల తర్వాత పూణె ఆడుతున్న మ్యాచ్ కాడవంతో ఈ మ్యాచ్‌లో గెలుపు మంత్రాన్ని కొనసాగించాలని యోచనలో పూణె ఉంది. డిఫెండింగ్‌ చాంపియన్‌‌గా ఐపీఎల్ పదో సీజన్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ సీజన్‌లో ఆకట్టుకుంటోంది.

తొలుత బెంగళూరు, గుజరాత్‌లపై విజయాలను నమోదు చేసిన హైదరాబాద్‌ అనంతరం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత తిరిగి ఫామ్ లోకి వచ్చిన జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్, పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌పై విజయాలు సాధించింది.

అయితే హైదరాబాద్ సాధించిన విజయాలన్నీ సొంతగడ్డపై సాధించిన కావడం విశేషం. ఈ సీజన్‌లో వేరే వేదికల్లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలవడం ఈ మ్యాచ్‌లో కాస్తంత కలవరపెడుతోంది. ఎందుకంటే ఈ మ్యాచ్ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి.

ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌ల్లో విజయంసాధించి ఎనిమిది పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే హైదరాబాద్‌పై పుణేకు మంచి రికార్డు ఉంది. గతే సీజన్‌లో పూణె సాధించిన నాలుగు విజయాల్లో రెండు సన్‌రైజర్స్‌పైనే కావడం విశేషం.

డేవిడ్‌ వార్నర్‌ అద్భుత ఫామ్‌లో

డేవిడ్‌ వార్నర్‌ అద్భుత ఫామ్‌లో

సన్ రైజర్స్ బ్యాటింగ్‌ విషయానికొస్తే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 239 పరుగులతో వార్నర్‌ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ 15 వికెట్లతో టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు.

 పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న భువీ

పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్న భువీ

దీంతో పర్పుల్‌ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. మరోవైపు అఫ్గాన్‌ సంచలన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తొమ్మిది వికెట్లతో సత్తా చాటుతున్నాడు. సిద్దార్థ్‌ కౌల్, దీపక్‌ హూడా రాణించాల్సిన అవసరముంది. మరోవైపు డిల్లీతో సీజన్‌లో తొలిమ్యాచ్‌ ఆడిన మహ్మద్‌ సిరాజ్‌ ఆకట్టుకున్నాడు. శనివారం నాటి మ్యాచ్‌లో సిరాజ్‌కు ఆడే అవకాశం రావచ్చు.

 వరుస ఓటములతో డీలా

వరుస ఓటములతో డీలా

ఇక రైజింగ్ పూణె సూపర్ జెయింట్ విషయానికి వస్తే వరుస ఓటములతో డీలా పడింది. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. బెంగళూరుతో గత మ్యాచ్‌లో 28 పరుగులు చేసి ఫర్వాలేదపించాడు. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌లాడిన ధోని 15 సగటుతో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.

స్టీవ్‌ స్మిత్‌ విశ్రాంతి

స్టీవ్‌ స్మిత్‌ విశ్రాంతి

మరోవైపు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ విశ్రాంతి కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరం కావడంతో పూణె బ్యాటింగ్ ఆర్డర్‌లో స్వప్ల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సీజన్‌లో 180 పరుగులు చేసిన స్మిత్‌ జట్టు తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఈ స్థితిలో స్మిత్‌ జట్టుకు దూరం కావడం పెద్ద దెబ్బే. స్మిత్ స్ధానంలో కెప్టెన్సీ బాధ్యతలను రహానే చేపట్టే అవకాశముంది.

బెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌లో విఫలం

బెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌లో విఫలం

బ్యాట్స్‌మెన్లలో మనోజ్‌ తివారీ, రాహుల్‌ త్రిపాఠీ గాడిలో పడాల్సి ఉంది. ఇక ఈ ఐపీఎల్‌లోనే ఖరీదైన ప్లేయర్‌గా నిలిచిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎనిమిది వికెట్లతో జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

రైజింగ్ పూణె సూపర్ జెయింట్

Steve Smith (captain), Faf du Plessis, Adam Zampa, Usman Khawja, MS Dhoni (wicketkeeper), Ajinkya Rahane, Ashok Dinda, Ankus Bains, Rajat Bhatia, Ankit Sharma, Ishwar Pandey, Jaskarn Singh, Baba Aparajith, Deepak Chahar, Mayank Agarwal, Dnaiel Christian, Lockie Ferguson, Ben Stokes and Manoj Tiwary.

Mahendra Singh Dhoni's form will remain in focus when the struggling Rising Pune Supergiant (RPS) square off against defending champions Sunrisers Hyderabad in an IPL 2017 encounter here tomorrow (April 22).

సన్ రైజర్స్ హైదరాబాద్:

David Warner (captain), Tanmay Agarwal, Ricky Bhui, Bipul Sharma, Ben Cutting, Shikhar Dhawan, Eklavya Dwivedi, Moises Henriques, Deepak Hooda, Chris Jordan, Siddharth Kaul, Bhuvneshwar Kumar, Ben Laughlin, Abhimanyu Mithun, Mohammad Nabi, Mohammed Siraj, Mustafizur Rahman, Ashish Nehra, Naman Ojha (wicketkeeper), Rashid Khan, Vijay Shankar, Barinder Sran, Pravin Tambe, Kane Williamson and Yuvraj Singh.

మ్యాచ్ ప్రారంభం 4 PM IST - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN

రాత్రి 8 గంటలకు - Mumbai Vs Delhi in Mumbai

ఆదివారం మ్యాచ్‌‌లు (April 23):

Gujarat Vs Punjab in Rajkot - 4 PM

Kolkata Vs Bangalore in Kolkata - 8 PM

పూణె తదుపరి మ్యాచ్ - Vs Mumbai in Mumbai on April 24 (Monday) - 8 PM

హైదరాబాద్ తదుపరి మ్యాచ్ - Vs Bangalore in Bengaluru on April 25 (Tuesday) - 8 PM

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+