
వార్నర్ అద్భుత ప్రదర్శన
సన్ రైజర్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి జట్టుకు చక్కటి శుభారంభాన్నిస్తున్నాడు. అయితే మిడిలార్డర్‌లో మోజెస్ హెన్రిక్స్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా విఫలమవడం జట్టును తీవ్ర కలవరపెడుతోంది. మరోవైపు ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్, నమన్ ఓజా కూడా రాణించాల్సి ఉంది.

బౌలింగ్‌లో పటిష్టంగా ఉన్న హైదరాబాద్
ఇక బౌలింగ్ విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ పటిష్టంగా ఉంది. టోర్నీలో పది వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ పర్పెల్ క్యాప్‌తో మొదటి స్ధానంలో ఉన్నాడు. మరోవైపు ఆఫ్గాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ ఏడు వికెట్లతో టాప్ త్రీలో కొనసాగుతున్నాడు. మరో వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా రాణిస్తున్నాడు.

రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం
ఇక పంజాబ్ విషయానికి వస్తే టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్.. అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైంది. ముఖ్యంగా టాపార్డర్ విఫల కావడం జట్టును కలవరపరుస్తోంది. జట్టులో మేటి ఆటగాళ్లైన కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్, ఇయాన్ మోర్గాన్, హషీమ్ ఆమ్లా సత్తా చాటాలని జట్టు ఆశిస్తోంది.

పాయింట్ల పట్టికలో చెరో నాలుగు పాయింట్లతో సమం
సోమవారం నాటి మ్యాచ్‌లో బౌలర్లు ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మలపై ఆశలు పెట్టుకుంది. గతంలో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించడం, ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉండడం లాంటి అంశాలతో ఇషాంత్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశముంది. పాయింట్ల పట్టికలో చెరో నాలుగు పాయింట్లతో సమంగా ఉన్నాయి.

జట్ల వివరాలు
సన్ రైజర్స్ హైదరాబాద్: David Warner (captain), Tanmay Agarwal, Ricky Bhui, Bipul Sharma, Ben Cutting, Shikhar Dhawan, Eklavya Dwivedi, Moises Henriques, Deepak Hooda, Chris Jordan, Siddharth Kaul, Bhuvneshwar Kumar, Ben Laughlin, Abhimanyu Mithun, Mohammad Nabi, Mohammed Siraj, Mustafizur Rahman, Ashish Nehra, Naman Ojha (wicketkeeper), Rashid Khan, Vijay Shankar, Barinder Sran, Pravin Tambe, Kane Williamson and Yuvraj Singh.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: Glenn Maxwell (captain), David Miller, Manan Vohra, Hashim Amla, Shaun Marsh, Armaan Jaffer, Martin Guptill, Eoin Morgan, Rinku Singh, Sandeep Sharma, Arman Jaffer, Anureet Singh, Mohit Sharma, KC Cariappa, Pradeep Sahu, Swapnil Singh, T Natrajan, Matt Henry, Varun Aaron, Axar Patel, Marcus Stoinis, Gurkeerat Mann, Rahul Tewatia, Darren Sammy, Wriddhiman Saha (wicketkeeper), Nikhil Naik, Ishant Sharma.
మ్యాచ్ ప్రారంభం రాత్రి 8 PM IST - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN
Also playing on Monday - Delhi Vs Kolkata in Delhi - 4 PM
మంగళవారం నాటి మ్యాచ్‌లు (April 18)
Gujarat Vs Bangalore in Rajkot - 8 PM
హైదరాబాద్ తదుపరి మ్యాచ్ - Vs Delhi in Hyderabad on April 19 (Wednesday) - 8 PM
పంజాబ్ తదుపరి మ్యాచ్ - Vs Mumbai in Indore on April 20 (Thursday) - 8 PM


Click it and Unblock the Notifications











