For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రివ్యూ: పంజాబ్ జోరుకు ఈడెన్‌లో బ్రేక్ పడుతుందా?

ఐపీఎల్ 10వ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గురువారం కోల్‌కతా నై ట్‌రైడర్స్‌‌తో తలపడనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గురువారం కోల్‌కతా నై ట్‌రైడర్స్‌‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓ విజయంతో పాటు ఓ పరాజయాన్ని సొంతం చేసుకున్న కోల్‌కతా... పంజాబ్ జోరుకు బ్రేక్ వేస్తుందా లేదో చూడాలి.

ఐపీఎల్లో పంజాబ్‌పై కోల్‌కతాకే మెరుగైన రికార్డే ఉంది. ముఖాముఖి పోరులో రెండు జట్లు 19 సార్లు తలపడగా 13సార్లు కోల్‌కతానే విజయం సాధించింది. ఇక గురువారం మ్యాచ్ జరుగుతున్న ఈడెన్‌ గార్డెన్స్‌లోనూ పంజాబ్‌పై కోల్‌కతాకే మంచి రికార్డు ఉంది. ఈ రెండు జట్లు ఎనిమిది సార్లు ఈడెన్ గార్డెన్స్‌లో తలపడగా ఆరు సార్లు కోల్‌కతా విజయం సాధించింది.

అరుదైన రికార్డుకి చేరువలో కోల్ కతా

అరుదైన రికార్డుకి చేరువలో కోల్ కతా

గురువారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా అరుదైన రికార్డుని సమం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఒక జట్టుపై వరుసగా ఏడు అంతకన్నా ఎక్కువ విజయాలు నమోదు చేసిన జట్టుగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఉంది. ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై బెంగళూరు వరుసగా ఎనిమిది విజయాలు సాధించి అరుదైన రికార్డును సృష్టించింది.

ఒక విజయం, ఒక పరాజయం

ఒక విజయం, ఒక పరాజయం

గురువారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌పై కోల్ కతా విజయం సాధిస్తే బెంగళూరు సృష్టించిన రికార్డును సమం చేస్తుంది. ఈ సీజన్‌లో కోల్ కతా ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌పై పది వికెట్ల తేడాతో కోల్ కతా విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.

క్రిస్‌ లిన్‌ స్ధానంలో షకీబ్‌ ఉల్‌ హసన్‌

క్రిస్‌ లిన్‌ స్ధానంలో షకీబ్‌ ఉల్‌ హసన్‌

గురువారం నాటి మ్యాచ్‌లో గాయం కారణంగా కోల్‌కతా ఆటగాడు క్రిస్‌ లిన్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అతని స్థానంలో షకీబ్‌ ఉల్‌ హసన్‌ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో గౌతం గంభీర్‌కి జోడీగా రాబిన్‌ ఊతప్ప ఓపెనర్‌గా రానున్నాడు. మరోవైపు ఉమేశ్‌ యాదవ్‌ కూడా ఈరోజు మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది.

రెండు వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్

రెండు వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్

ఇక పంజాబ్ విషయానికి వస్తే రెండు వరుస విజయాలతో జోరు మీదుంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి అదే జోరుని కొనసాగించాలని కెప్టెన్ మ్యాక్స్‌వెల్ భావిస్తున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో మ్యాక్స్‌వెల్‌, డేవిడ్‌ మిల్లర్‌‌లు రాణించడంతో పంజాబ్ వరుస విజయాలను సొంతం చేసుకుంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

కోల్‌కతా నైట్ రైడర్స్: Gautam Gambhir (captain), Darren Bravo, Trent Boult, Piyush Chawla, Nathan Coulter-Nile, Colin De Grandhomme, Rishi Dhawan, Sayan Ghosh, Shakib-Al-Hasan, Sheldon Jackson, Ishank Jaggi, Kuldeep Yadav, Chris Woakes, Chris Lynn, Sunil Narine, Manish Pandey, Yusuf Pathan, Ankit Rajpoot, Suryakumar Yadav, Robin Uthappa (wicketkeeper), Umesh Yadav.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: Glenn Maxwell (captain), David Miller, Manan Vohra, Hashim Amla, Shaun Marsh, Armaan Jaffer, Martin Guptill, Eoin Morgan, Rinku Singh, Sandeep Sharma, Arman Jaffer, Anureet Singh, Mohit Sharma, KC Cariappa, Pradeep Sahu, Swapnil Singh, T Natrajan, Matt Henry, Varun Aaron, Axar Patel, Marcus Stoinis, Gurkeerat Mann, Rahul Tewatia, Darren Sammy, Wriddhiman Saha (wicketkeeper), Nikhil Naik, Ishant Sharma.

రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN

ఏప్రిల్ 14 (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లు:

Bangalore Vs Mumbai in Bengaluru - 4 PM IST

Gujarat Vs Pune in Rajkot - 8 PM IST

కోల్‌కతా తదుపరి మ్యాచ్ - Vs Hyderabad in Kolkata on April 15 (Saturday) - 4 PM IST

పంజాబ్ తదుపరి మ్యాచ్ - Vs Delhi in Delhi on April 15 (Saturday) - 8 PM IST

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+