
సహచరుల్లో స్ఫూర్తినింపుతూ
ఇక, గతేడాది ఛాంఫియన్‌గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహచరుల్లో స్ఫూర్తినింపుతూ టైటిల్ దక్కించుకోవడంలో కీలకమయ్యాడు. ఏకంగా తొ మ్మిది అర్ధసెంచరీలతో కోహ్లీ తర్వాత టో ర్నీ టాపర్‌గా నిలిచాడు. ప్రత్యర్థి జట్లు భారీ లక్ష్యాలను నిర్దేశించినప్పుడు బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు.

టైటిల్ ఎగురేసుకుపోవాలనే పట్టుదలతో
ఈ క్రమంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుత విజయాలను జట్టుకు అందించాడు. మరోవైపు స్వల్ప లక్ష్యాలను నిర్దేశించినా, కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ముస్తాఫిజుర్ రెహమాన్, నెహ్రా, భువనేశ్వర్, హెన్రిక్స్ రాణించిన తీరు అద్భుతం. లీగ్ ఆరంభానికి ముందే స్టార్ ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్న మిగతా జట్లకు భిన్నంగా కనిపిస్తున్న హైదరాబాద్ మరోసారి టైటిల్ ఎగురేసుకుపోవాలనే పట్టుదలతో ఉంది.

హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్
ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన హైదరాబాదీ కుర్రాడు మహ్మద్ సిరాజ్ తన సత్తా ఏంటో చాటేందుకు సిద్ధమవుతున్నాడు. వేలంలో 2.6 కోట్లు పలికిన సిరాజ్.. తనదైన ప్రదర్శనతో ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు తహతహలాడుతున్నాడు.

తొలిసారిగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి నబీ, రషీద్
మరోవైపు తొలిసారిగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి నబీ, రషీద్ ఐపీఎల్‌లో హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నారు. మెంటార్ లక్ష్మణ్, కోచ్‌లు టామ్ మూడీ, మురళీధరన్‌ల శిక్షణలో హైదరాబాద్ గత ప్రదర్శనను పునరావృతం చేస్తుందో చూడాలి. మిగతా జట్లతో పోలిస్తే, సన్‌రైజర్స్‌కు ఇప్పటి వరకు గాయాల బెడద లేదు. ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో ఊన్నారు.

జట్ల వివరాలు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: Shane Watson (captain), Virat Kohli, AB de Villiers, Sarfaraz Khan, Sreenath Aravind, Avesh Khan, Samuel Badree, Stuart Binny, Yuzvendra Chahal, Aniket Choudhary, Praveen Dubey, Chris Gayle, Travis Head, Iqbal Abdulla, Kedar Jadhav (wicketkeeper), Mandeep Singh, Tymal Mills, Adam Milne, Pawan Negi, Harshal Patel, Sachin Baby, Tabraiz Shamsi, and Billy Stanlake.
సన్ రైజర్స్ హైదరాబాద్: David Warner (captain), Tanmay Agarwal, Ricky Bhui, Bipul Sharma, Ben Cutting, Shikhar Dhawan, Eklavya Dwivedi, Moises Henriques, Deepak Hooda, Chris Jordan, Siddharth Kaul, Bhuvneshwar Kumar, Ben Laughlin, Abhimanyu Mithun, Mohammad Nabi, Mohammed Siraj, Mustafizur Rahman, Ashish Nehra, Naman Ojha (wicketkeeper), Rashid Khan, Vijay Shankar, Barinder Sran, Pravin Tambe, Kane Williamson and Yuvraj Singh.
Match starts at 8 PM IST - LIVE on Sony SIX, Sony Max
Playing on April 6 (Thursday) - Pune Vs Mumbai - 8 PM IST (Pune)
RCB's next match - Vs Delhi (April 8 Saturday) 8 PM IST - Bengaluru
SRH's next match - Vs Gujarat Lions (April 9 Sunday) 4 PM IST - Hyderabad


Click it and Unblock the Notifications











