Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి వన్డే ప్రివ్యూ: జోరుమీదున్న టీమిండియా: ప్రతీకారంతో లంక

డంబుల్లా: టెస్ట్ సిరీస్‌ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. అదే జోరును వన్డే సిరీస్‌లోనూ కొనసాగించాలనుకుంటోంది. ఇక ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న శ్రీలంక జట్టు వన్డే సిరీస్‌ను దక్కించుకుని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం(ఆగస్టు 20) ప్రారంభం కానున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లూ హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇండియాతోపాటు శ్రీలంక కూడా పటిష్టంగానే ఉంది. వన్డేల్లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ టీమిండియా తరపున ఓపెనింగ్ చేయనున్నారు. కెఎల్ రాహుల్ 4వ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. ఎంఎస్ ధోనీ 5వ స్థానంలో బరిలోకి దిగనున్నారు.

ఆల్ రౌండర్ అయిన హర్ధిక్ పాండ్యా 7వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. జాదవ్ 6వ స్థానంలో రానున్నాడు. కాగా, ఇప్పటివరకు తొలి వన్డే జరగనున్న స్టేడియంలో జరిగిన 11 మ్యాచ్ లలో నాలుగింటిలోనే శ్రీలంక విజయం సాధించడం గమనార్హం. అంటే ఈ మైదానం టీమిండియాకే అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.

Preview: India vs Sri Lanka Ist ODI: India's journey to World Cup 2019 begins at Dambulla

భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రాలు భారత బౌలింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరించనున్నారు. కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, యజ్వేందర్ చహల్‌లలో ఎవరో ఒకరికి అవకాశం లభించనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం పాలైన శ్రీలంక కెప్టెన్ కు ఈ వన్డే సిరీస్ సవాల్ అనే చెప్పవచ్చు.

టీమిండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, మనీష్ పాండే, అజింక్యా రహానే, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, యజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్, శర్దుల్ ఠాకూర్.

శ్రీలంక: ఉపుల్ తరంగ(కెప్టెన్), ఏంజిలో మాథ్యూస్, నిరోషాన్ డిక్వెల్లా (డబ్ల్యు), డాన్షుకా గుణతిలకా, కుసుల్ మెండీస్, చమరా కపగుడేరా, మిలిండా సిరివారనా, మలిందా పుష్పకమరా, అకిలా దానంజయ, లక్ష్మ సాండ్కన్, థేసర పెరేరా, వనిండు హసరంగ, లసిత్ మలింగా, దుష్మాతా చమేరా , విశ్వ ఫెర్నాండో.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: Kohli's men start favourite
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+