For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20 ప్రివ్యూ: భారత్ vs ఆస్ట్రేలియా, ఇరు జట్ల బలం బలహీనతలివే!

India vs Australia 1st T20I Preview : Both Teams Strengths & Weaknesses | Oneindia Telugu
Preview: India Vs Australia 1st T20I at Brisbane

హైదరాబాద్: బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా తలపడనుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సుదీర్ఘ పర్యటనకు తెరలేవనుంది.

ఈ నేపథ్యంలో తొలి టీ20లో తలపడే తుది జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో 12 మంది సభ్యులతో కూడిన జట్టుని ప్రకటించింది. వికెట్ కీపర్‌గా యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు. దినేశ్ కార్తీక్‌‌ను మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా ప్రకటించారు.

తొలి టీ20 నేపథ్యంలో ఇరు జట్ల మధ్య బలాబలాలను ఒక్కసారి పరిశీలిస్తే:

టీమిండియా బలం:

టీమిండియా బలం:

టీ20ల్లో టీమిండియా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రపంచంలోనే ఇద్దరు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను భారత జట్టు కలిగి ఉంది. ఆ ఇద్దరూ మరెవరో కాదు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ. ఈ ఇద్దరినీ కట్టడి చేయడం ఆసీస్ బౌలర్లకు కష్టమే. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్, చాహల్ లాంటి మ్యాచ్ విన్నింగ్స్ బౌలర్లు భారత జట్టు సొంతం. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత బౌలింగ్ దళం ప్రస్తుత జట్టులో ఉండటం విశేషం.

బలహీనత:

టీమిండియా ఏకైక బలహీనత మిడిలార్డర్ సమస్య. #4 స్ధానం నుంచి లోయర్ ఆర్డర్ వరకు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే సరైన ఆటగాడు లేకపోవడం. ఈ పర్యటనలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడం కూడా జట్టుకు లోటే. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి ఫాస్ట్ పిచ్‌లపై హార్దిక్ పాండ్యా లేకపోవడం జట్టుకు ఓ సమస్యగా మారింది.

చూడదగ్గ ఆటగాళ్లు:

విండిస్‌తో ముగిసిన టీ20 సిరిస్ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇక, ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్‌లో జరిగే తొలి టీ20లో రోహిత్ శర్మ పరుగుల వరద పారించే అవకాశం ఉంది. ఇప్పటికే గబ్బా స్టేడియంలో టీమిండియా తీవ్రంగా నెట్స్‌లో శ్రమిస్తోంది.

తొలి టీ20లో ఆడే భారత జట్టు:

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, యుజువేంద్ర చాహల్.

ఆస్ట్రేలియా బలం:

ఆస్ట్రేలియా బలం:

సొంతగడ్డపై సిరిస్ జరగుతుండటమే. కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఏ క్షణమైనా మ్యాచ్‌ని మలుపుతిప్పగల సమర్ధుడు. ఇక, ఆసీస్ బౌలింగ్ లైనప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫేసర్లు ఆ జట్టు సొంతం. స్టాన్ లేక్ ఆ జట్టు తరుపున రాబోయే ఫ్యూచర్ స్టార్‌గా ఈ సిరిస్‌తో ఎదిగే అవకాశం ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బౌలర్లలో ఆండ్రూ టై ఒకడు.

బలహీనత

బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత ఆ జట్టు స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు జాతీయ జట్టుకు దూరం కావడంతో గత కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శన చేస్తోంది. టాంపరింగ్‌ వివాదం మొత్తం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పట్నుంచి ఆ జట్టు ఆట దిగజారుతూ వచ్చింది. ఆత్మవిశ్వాస లోపానికి తోడు.. జట్టు కూడా బలహీనపడింది. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన ఏకైక టీ20లో సైతం ఆసీస్ ఓడిపోయింది. బ్యాటింగ్‌లో టాపార్డర్ క్లిక్ అయితే ఒకే లేదంటే అంతే సంగతి.

చూడదగ్గ ప్లేయర్లు

చూడదగ్గ ప్లేయర్లు

సొంతగడ్డపై సొంతమైదానంలో సొంత ప్రేక్షకుల మధ్య ఆస్ట్రేలియా జట్టుకు భారీ మద్దతు లభించే అవకాశం. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను అంత తక్కువ అంచనా వేయలేం. తమ గడ్డపై సరైన రికార్డు లేని భారత్‌ను ఓడించి తిరిగి ఫామ్‌ అందుకోవాలని ఆ జట్టు చూస్తోంది. వన్డే ప్రపంచకప్‌ ముంగిట గాడిన పడటానికి ఈ సిరీస్‌నే ఉపయోగించుకోవాలనుకుంటోంది.

ఆస్ట్రేలియా టీ20 జట్టు:

ఆరోన్ ఫించ్(కెప్టెన్), అలెక్స్ క్యారీ, ఆష్టన్ అగర్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, నాథన్ కౌల్టర్ నైల్, క్రిస్ లిన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ మెక్డోర్మెట్, డార్షీ షాట్, బిల్లీ స్టాన్ లేక్, స్టోయినిస్, ఆండ్రూ టై, ఆడమ్ జంపా

మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతోంది?

మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతోంది?

సాధారణంగా ఆస్ట్రేలియాలో భారత పర్యటన టెస్టులతోనే మొదలవుతుంది. ఈసారి కొంచెం భిన్నంగా తొలుత టీ20 సిరీస్‌ జరగనుంది. తర్వాత టెస్టులు ఆడి.. చివరగా వన్డే సిరీస్‌లో తలపడుతుంది. అయితే, ఈసారి మాత్రం తొలుత మూడు టీ20ల సిరిస్ ఆరంభం కానుంది. టీ20లంటే పిచ్‌లు, వాతావరణంతో పెద్దగా సంబంధం ఉండదు. పైగా భారత జట్టు కూడా బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఈ సిరీస్‌ గెలిచి టెస్టులకు ముందు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని చూస్తోంది.

మ్యాచ్ ప్రారంభం: మధ్యాహ్నాం 2.30 గంటలకు

మ్యాచ్ ప్రారంభం: మధ్యాహ్నాం 2.30 గంటలకు

ఛానల్: సోనీ స్పోర్ట్ నెట్‌వర్క్

లైవ్ స్ట్రీమింగ్: సోనీ లివ్

Story first published: Tuesday, November 20, 2018, 15:59 [IST]
Other articles published on Nov 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+