Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమెన్ వరల్డ్ కప్: ఇంగ్లాండ్‌తో తొలి పోరు, మిథాలీ సేన మురిపిస్తుందా?

హైదరాబాద్: భారత పురుషుల జట్టు ఐసీసీ వరల్డ్ కప్‌ను ఇప్పటికి మూడు సార్లు సాధించింది. వన్డేల్లో రెండుసార్లు, టీ20ల్లో ఒకసారి టీమిండియా వరల్డ్ కప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. అయితే మహిళల క్రికెట్‌లో మాత్రం వరల్డ్ కప్ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా?

ఇంగ్లాండ్ వేదికగా శనివారం నుంచి 11వ ఉమెన్ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. జూన్‌ 24 నుంచి జూలై 23 వరకు జరిగే ఈ వరల్డ్ కప్‌లో టాప్‌-8 దేశాలు టోర్నీ తలపడనున్నాయి. రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్దతిలో సాగే ఈ టోర్నీల్లో ప్రతి జట్టు మిగిలిన ఏడు దేశాలతో మ్యాచ్‌లను ఆడుతుంది. ఈ టోర్నీలో టైటిల్‌ ఫేవరేట్‌‌లుగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు బరిలో దిగుతున్నాయి.

ఆడిన 17 మ్యాచ్‌ల్లో 16 మ్యాచ్‌ల్లో విజయం

ఆడిన 17 మ్యాచ్‌ల్లో 16 మ్యాచ్‌ల్లో విజయం

ఈ మధ్య కాలంలో భారత మహిళల జట్టు ఆడిన 17 మ్యాచ్‌ల్లో 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. తద్వారా నాలుగు వన్డే సిరీస్‌లను కైసవం చేసుకుంది. ఈ క్రమంలో ఈ టోర్నీలో మిథాలీ రాజ్‌ కెప్టెన్‌గా భారత మహిళల జట్టు అండర్‌ డాగ్‌గా బరిలో దిగుతోంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో శనివారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడనుంది.

ఇంగ్లాండ్-భారత్ ముఖాముఖి పోరులో ఇంగ్లాండ్ ఆరు మ్యాచ్‌ల్లో విజయం

ఇంగ్లాండ్-భారత్ ముఖాముఖి పోరులో ఇంగ్లాండ్ ఆరు మ్యాచ్‌ల్లో విజయం

1978 నుంచి ఇప్పటి వరకు భారత్‌తో ఇంగ్లాండ్‌ తొమ్మిది మ్యాచ్‌లు ఆడగా, ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. సొంత గడ్డపై జట్టుకు నాలుగో టైటిల్‌ అందించాని జట్టు కెప్టెన్ నైట్‌ ఆశిస్తోంది. ఇంగ్లాండ్‌పై గెలుపుతో బోణి కొట్టాలని మిథాలీరాజ్‌ సేన ఉవ్విళూరుతోంది. క్వాలిఫైర్స్‌ టోర్నీని సాధించి ప్రపంచ కప్‌ బరిలో దిగిన భారత్‌ జట్టు ఇటీవల కాలంలో అటు బ్యాటింగ్‌లోను, ఇటు బౌలింగ్‌లోను సత్తా చాటుతోంది.

అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టారు

అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టారు

ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్‌ రౌత్‌లో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో 286 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో ఉప్పల్‌ తరంగ, సనత్‌ జయసూర్య అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టారు. ఇక కెప్టెన్ మిథాలీ రాజ్‌కు 100 వన్డేలకు కెప్టెన్సీ వహించిన అనుభవం ఉంది. అంతేకాదు 15 వన్డేల్లో 833 పరుగులతో మిథాలీ 104.12 యావరేజితో అద్భుత ప్రదర్శన చేస్తోంది.

2013లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మిథాలీ రాజ్

2013లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన మిథాలీ రాజ్

ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల్లో సగటున 60.83తో పరుగుల సాధించిన మిథాలీ 2013 టోర్నీలో పాకిస్తాన్‌పై 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. తన క్రికెట్ కెరీర్లో మిథాలీ రాజ్ ఆడుతున్న ఐదో వరల్డ్ కప్ ఇది. ఇక వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జులన్‌ గోస్వామి భారత్ బౌలింగ్‌కు అదనపు బలం.

టీమిండియా:

టీమిండియా:

మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌, స్మృతి, వేద కృష్ణమూర్తి, మోనా మేశ్రమ్‌, పూనమ్‌ రౌత్‌, దీప్తి శర్మ, జులన్‌, శిఖ పాండే, ఏక్తా బిస్త్‌, సుష్మ వర్మ, మాన్సి జోషి, రాజేశ్వరి, పూనమ్‌, నుజాత్‌ పర్వీన్‌

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+