సిరిస్ చిక్కేనా: విండిస్‌పై కోహ్లీసేన సత్తా చాటుతుందా?
హైదరాబాద్: వెస్టిండిస్‌తో ఐదు వన్డేల సిరిస్ ముగింపు దశకు చేరుకుంది. భారత్, వెస్టిండిస్ జట్లు గురువారం చివరిదైన ఐదో వన్డేలో కింగ్ స్టన్ వేదికగా తలపడనున్నాయి. సిరీస్‌లో ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.
నాలుగో వన్డేలో భారత్ 189 పరుగులకే విండీస్‌ను కట్టడి చేశాక.. సిరీస్ భారత్ చేజిక్కినట్లేనని అనుకున్నారంతా. కానీ బలమైన బ్యాటింగ్ లైనప్ విఫలం కావడంతో భారత్ 11 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. నాలుగో వన్డేలో అనూహ్య విజయంతో తమకు కలిసొచ్చిన మైదానంలో మరో గెలుపు సాధించాలని విండిస్ జట్టు పట్టుదలగా ఉంది.

నాలుగో వన్డేలో ఓటమిపై కంగుతిన్న కోహ్లీసేన
నాలుగో వన్డేలో ధోని నెమ్మదైన ఇన్నింగ్స్ ఓటమికి కారణంగా పైకి కనిపిస్తున్నా టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది. అయితే చివరి వన్డేలో తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. వరుసగా నాలుగు వన్డేల్లోనూ కనీసం 50కు పైగా పరుగులు సాధించిన రహానే తన ఫామ్‌ను కొనసాగిస్తూ నే వేగంగా కూడా ఆడాల్సిన అవసరం ఉంది. గత రెండు వన్డేల్లో విఫలమైన ధావన్‌తో పాటు కెప్టెన్ కోహ్లీ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడితే జట్టుకు లాభిస్తుంది. మూడేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన దినేశ్ కార్తీక్‌ను.. కేవలం ఒక్క మ్యాచ్‌కే తప్పించకపోవచ్చు.

ఆకరి వన్డేల్ ఆత్మవిశ్వాసంతో విండిస్
తొడకండరాల గాయానికి గురైన యువరాజ్ కోలుకుంటే దినేశ్ కార్తీక్‌కు విశ్రాంతి కల్పించొచ్చు. బౌలింగ్‌లో భువనేశ్వర్ తిరిగి రానుండగా, రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్ ఆడనున్నాడు. మరోవైపు నాలుగో వన్డేలో అనూహ్య విజయం విండీస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. తొలి మూడు మ్యాచ్‌లలో టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ చేసిన భారీగా పరుగులు సమర్పించుకున్న ఆ జట్టు, గత మ్యాచ్‌లో బౌలింగ్‌తోనే విజయం సాధించగలిగింది. దీంతో చివరి వన్డేలో హోల్డర్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది.

2006లో 4-1తో భారత్‌ను ఓడించిన విండిస్
గత మ్యాచ్‌లో తన స్లో బంతులతో ధోనిని కట్టడి చేసిన పేసర్ కెస్‌రిక్ విలియమ్స్ ఆకట్టుకున్నాడు. అతనికి కెప్టెన్ హోల్డర్ అండగా నిలిస్తే మంచి ఫలితం రాబట్టవచ్చు. స్పిన్నర్లు బిషూ, నర్స్ కూడా ప్రభావం చూపిస్తున్నారు. భారత్‌తో జరిగిన గత ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లలో కూడా విండీస్ ఓడిపోయింది. ఆఖరి సారిగా ఆ జట్టు 2006లో భారత్‌ను 4-1తో ఓడించింది.

జట్ల వివరాలు(అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రహానే, ధోని, కార్తీక్, యువరాజ్, జాదవ్, పంత్, పాండ్యా, కుల్దీప్, జడేజా, అశ్విన్, ఉమేశ్, షమీ, భువనేశ్వర్
వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), లూయీస్, కైల్ హోప్, షై హోప్, జేసన్ మొహమ్మద్, ఛేజ్, పావెల్, నర్స్, విలియమ్స్, బిషూ, జోసెఫ్
రాత్రి గం. 7.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications