Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీ గడ్డపై సిరిస్ నెగ్గి దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించేనా?

Preview, 4th Test: South Africa look to pin controversy-ridden Australia

హైదరాబాద్: సఫారీ గడ్డపై ఆఖరి టెస్టుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా జట్టు శుక్రవారం నుంచి ఆతిథ్య దక్షిణాఫ్రికాతో చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్ ఆడనుంది. జోహెన్స్ బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

బాల్ టాంపరింగ్ వివాదం నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఎలా ఆడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిషేధం కారణంగా జట్టులోని సీనియర్ క్రికెటర్లు స్మిత్‌, వార్నర్‌‌లతో పాటు ఓపెనర్‌ బాన్‌క్రాప్ట్‌ తప్పుకోవడంతో ప్రస్తుతం ఆసీస్ జట్టు చాలా బలహీనంగా తయారైంది.

మరోవైపు ఈ మ్యాచ్ అనంతరం కోచ్‌గా డారెన్ లీమన్‌ కూడా తప్పుకొంటున్నట్టు ప్రకటించడంతో ఆసీస్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో గంభీరమైన వాతావరణం నెలకొంది. దీనిని అదనుగా తీసుకుని దక్షిణాఫ్రికా జట్టు సిరిస్‌ను 3-1తో కైవసం చేసుకోవాలని చూస్తోంది.

నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తరుపున రెన్‌షా, బర్న్స్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. ఇక, స్టీవ్ స్మిత్ స్థానంలో పీటర్ హాండ్స్‌కోంబ్‌ ఆడే అవకాశం ఉంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా టిమ్ పైనీ వ్యవహారించనున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో దక్షిణాఫ్రికా 2-1తో ఆధిక్యంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆస్ట్రేలియాపై స్వదేశంలో సిరీస్‌ నెగ్గడం దక్షిణాఫ్రికాకు తొలిసారి అవుతుంది.

కోచ్ పదవికి డారెన్ లీమన్ వీడ్కోలు
ఆస్ట్రేలియా క్రికెట్‌లో బాల్ టాంపరింగ్ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీవ్‌ స్మిత్‌, వార్నర్‌, బాన్‌క్రాప్ట్‌లపై ఇప్పటికే నిషేధం పడగా అనూహ్యంగా కోచ్‌ డారెన్‌ లీమన్‌ కూడా తప్పుకొంటున్నట్టు ప్రకటించాడు. జొహాన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో శుక్రవారం ప్రారంభమయ్యే చివరి టెస్టే తనకు కూడా ఆఖరిదని ప్రీమ్యాచ్‌ విలేకరుల సమావేశంలో లీమన్ ప్రకటించాడు.

మూడో టెస్టులో టాంపరింగ్‌ కోచ్‌ లీమన్‌కు తెలిసే జరిగిందని, క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయానికి ముందే అతడు రాజీనామా చేస్తాడని కథనాలు వచ్చాయి. అయితే సీఏ అతడికి క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో పాటు ఆ రోజు మైదానంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే తను వాకీటాకీలో హాండ్స్‌కోంబ్‌తో మాట్లాడినట్టు స్పష్టం చేసింది. తనే కోచ్‌గా కొనసాగుతాడని కూడా తేల్చింది. అయితే లీమన్‌ మాత్రం రాజీనామా చేశాడు.

జట్ల వివరాలు:
దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), డీన్ ఎల్గార్, ఐడెన్ మార్క్రమ్, హషీం ఆమ్లా, డివిల్లియర్స్, టెంబా బవూమ, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), వెర్నన్ ఫిలాండర్, కేశవ్ మహారాజ్, కగిసో రాడాడా, మోర్నే మోర్కెల్.

ఆస్ట్రేలియా: టిమ్ పైనీ (కెప్టెన్), జోన్ బర్న్స్, పాట్ కుమ్మిన్స్, పీటర్ హాండ్స్కాంబ్, జోష్ హాజెల్‌ఉడ్, జోన్ హాలండ్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మ్యాట్ రెన్షా, రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్.

ప్రత్యక్ష ప్రసారం: 1.30 pm నుండి సోనీ సిక్స్, సోనీ సిక్స్ HDలో

Story first published: Friday, March 30, 2018, 10:32 [IST]
Other articles published on Mar 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+