Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరుణుడి ముప్పుతో ఉత్కంఠగా మూడో టీ20: ఒత్తిడిలో ధోని, సిరాజ్‌కు చోటు దక్కేనా?

హైదరాబాద్: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య చివరిదైన మూడో టీ20కి అంతా సిద్దమైంది. మూడు టీ20ల సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో టీ20 మంగళవారం తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో మూడో టీ20లో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

వన్డే సిరీస్‌ను నెగ్గిన కోహ్లీసేన టీ20 సిరీస్‌నూ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉండగా.. వన్డే సిరీస్‌ను త్రుటిలో చేర్చుకున్న కివీస్‌ కనీసం టీ20 సిరీస్‌ అయినా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఢిల్లీ వేదకగా జరిగిన తొలి టీ20లో కోహ్లీసేన అలవోక విజయం సాధించగా... రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో టీ20లో మాత్రం కోహ్లీసేన పూర్తిగా విఫలమైంది.

దీని ఫలితంగా మూడో టీ 20కి ప్రాధాన్యత సంతరించుకుంది. తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లోనే హైదరాబాదీ కుర్రాడు సిరాజ్‌ విఫలమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ 4 ఓవర్లు వేసి ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో భారత్ కూడా ఓటమిపాలైంది. దీంతో సిరాజ్‌ను మూడో టీ20లో తప్పిస్తారా? లేక ఇంకో అవకాశం ఇస్తారేమో చూడాలి.

 సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌

సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌

మరోవైపు సిరీస్‌ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌ కాబట్టి అతడిని పక్కన పెట్టే అవకాశం కూడా ఉంది. మూడో పేసర్‌ను ఆడించడం కోసం ఒక బ్యాట్స్‌మన్‌ను తగ్గించుకోవడంతో భారత బ్యాటింగ్‌ లైనప్ బలహీనంగా మారింది. కాబట్టి చివరి మ్యాచ్‌లో సిరాజ్‌ బదులు ఓ బ్యాట్స్‌మన్‌ను ఆడించే అవకాశం లేకపోలేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. సిరాజ్‌ వద్దనుకుంటే మనీష్‌ పాండే లేదా కేదార్‌ జాదవ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

 ధోనిని ఏ స్ధానంలో ఆడించాలనే

ధోనిని ఏ స్ధానంలో ఆడించాలనే

ఇక, మూడో టీ20లో ధోనిని ఏ స్ధానంలో ఆడించాలనే దానిపై కూడా జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనలో పడింది. తొలి టీ20లో ఐదో స్థానంలో క్రీజులోకి వచ్చిన ఆయన తర్వాతి మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండో టీ20లో న్యూజిలాండ్ ఓపెనర్ మన్రో సెంచరీ సాధించడంతో నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి కివీస్‌ 196 పరుగులు చేసింది.

 బ్యాటింగ్‌లో దూకుడుని తగ్గించిన ధోని

బ్యాటింగ్‌లో దూకుడుని తగ్గించిన ధోని

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. విరాట్‌ కోహ్లీ (65) పరుగులతో రాణించగా, ఆ తర్వాత ధోని (49) ఫరవాలేదనిపించాడు. అయితే టీమిండియా సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతున్న కొద్దీ ధోని బ్యాటింగ్‌లో దూకుడుని తగ్గించాడు. చివర్లో పేలవ షాట్‌కు పెవిలియన్‌ చేరి హాఫ్ సెంచరీని చేజార్చుకున్నాడు.

 32 బంతుల్లో ధోని చేసింది 23 పరుగులే

32 బంతుల్లో ధోని చేసింది 23 పరుగులే

ధోనీ చేసిన 49 పరుగుల్లో ఫోర్లు, సిక్సర్ల ద్వారా వచ్చినవి 26 మాత్రమే. ఇందుకు తీసుకున్న బంతులు 5 మాత్రమే. దీనిని బట్టి చూస్తే మిగతా 32 బంతుల్లో ధోని చేసింది 23 పరుగులే. దీంతో ధోనిపై మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. టీ20లకు వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని కూడా అన్నారు.

 మూడో టీ20కి వరుణుడి ముప్పు

మూడో టీ20కి వరుణుడి ముప్పు

మరోవైపు మూడో టీ20లో ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మూడో టీ20కి వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ముందుస్తు హెచ్చరికలు అటు క్రికెట్ మ్యాచ్ నిర్వహకుల్ని, ఇటు అభిమానుల్ని కలవరపరుస్తున్నాయి.

 20 నిమిషాల్లోపే మైదానాన్ని సిద్ధం చేస్తాం

20 నిమిషాల్లోపే మైదానాన్ని సిద్ధం చేస్తాం

ఇటీవల ఆసీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. వర్ష సూచన నేపథ్యంలో కేరళ క్రికెట్ సంఘం స్పందించింది. 'స్టేడియంలో అద్భుతమైన డ్రైనేజీ సిస్టమ్ ఉంది. సాయంత్రం వర్షం కురిస్తే ఆగిపోయిన 20 నిమిషాల్లోపే మైదానం సిద్ధం చేయగలం. ఆదివారం రిహార్సల్‌ సైతం చేశాం. రోజు మొత్తం వర్షం కురిసినా నిమిషాల వ్యవధిలోనే సిద్ధం చేయగలం' అని కేరళ క్రికెట్‌ సంఘం కార్యదర్శి జయేశ్‌ జార్జ్‌ తెలిపారు.

 19వ వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం

19వ వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం

గ్రీన్ ఫీల్డ్ స్టేడియంగా మారిన తర్వాత ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. చివరిసారిగా 29 ఏళ్ల కిందట తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో వెస్టిండిస్ జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఇదిలా ఉంటే భారత్‌లో టీ20లకు ఆతిథ్యమిస్తున్న 19వ వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం నిలిచింది.

 జట్లు అంచనా:

జట్లు అంచనా:

భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, చాహల్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, మొహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ బ్రూస్, గ్రాండ్ హోమ్, గ్లెన్ ఫిలిప్స్, మున్రో, సాంట్నార్, మిల్నే, నికోలస్, ఇష్ సోధీ

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+