న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రివ్యూ: విశాఖపట్నం వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక మూడో వన్డే

Preview, 3rd ODI: India look to seal the series against SL

హైదరాబాద్ : విశాఖపట్నం డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-ఏడీసీఏ స్టేడియం ఇప్పటి వరకు బ్యాటింగ్‌లో అద్వితీయమైన రికార్డును కల్గి ఉంది. ఇప్పుడు అదే స్టేడియం భారత్-శ్రీలంకల మధ్య జరిగే మూడవ వన్డేకు వేదిక కానుంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ఒక గెలుపు ఒక ఓటమిగా స్కోరును కల్గి ఉన్నాయి. అయితే ఈ ఆఖరి వన్డేతో ఏ జట్టు గెలుస్తుందో అనే ఉత్కంఠ ఈ మ్యాచ్‌పై ఉంది.

రోహిత్ శర్మ మరోసారి శ్రీలంక మీద విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్లీ కెప్టెన్‌గానే కొనసాగుతున్న రోహిత్ తన టీంను తీసుకుని విశాఖకు చేరుకున్నాడు.
2015 తర్వాత ఇదే మైదానంలో జరిగిన ఏడు మ్యాచ్‌లలో భారత్ ఒక్కసారి మాత్రమే పరాజయం పాలైంది.

రెండవ వన్డే అనంతరం విజయోత్సాహంలో ఉన్న భారత్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, అదే ఉత్సాహంలో ఉన్నట్లు కనిపిస్తుంది. బ్యాటింగ్ లో మళ్లీ తాము ఫామ్‌లో వచ్చామంటున్న భారత క్రికెటర్లు తాము మ్యాచ్‌కు సిద్ధమంటున్నారు. బౌలర్లు తాము కూడా వికెట్లు తమవైన శైలీలో పడగొట్టి కొత్త రికార్డులను నెలకొల్పాలనే కసిలో ఉన్నారు.

మ్యాచ్‌లో పాల్గొననున్న ఇరు జట్లు:
భారత్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే. ఎమ్మెస్ ధోనీ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, ఎం ఎస్ వాషింగ్‌టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యుజవేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్, అజింక్యా రహానే, అక్సర్ పటేల్, సిద్దార్థ్ కౌల్

శ్రీలంక: తిసర పెరెరా (కెప్టెన్), ఉపల్ తరంగ, దనుష గుణతిలక, లాహిరూ తిరిమన్నె, అసెలా గుణరత్నె, సదీరా సమరవిక్రమ, నిరోషన్ డిక్వెలా (వికెట్ కీపర్), ధనంజయ దె సిల్వా, ఏంజిలొ మాథ్యూస్, సచిత్ పతిరన, సురంగ లక్మల్, నువాన్ ప్రదీప్, అకిలా ధనంజయ, చతురంగ దె సిల్వా, దుష్మంత చమీరా, కుసల్ పెరెరా.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 16, 2017, 17:45 [IST]
Other articles published on Dec 16, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X