
రెట్టింపు ఉత్సాహాంతో బరిలోకి టీమిండియా
మూడో వన్డేలో టీమిండియా రెట్టింపు ఉత్సాహాంతో బరిలోకి దిగుతోంది. ఇటు పేసర్లు, అటు స్పిన్నర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తుండటం భారత్ వరుసగా రెండు విజయాలను సాధించింది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టెస్ట్ సిరీస్ నుంచీ బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్‌శర్మ వన్డే సిరీస్‌లోనూ అదే తీరు కనబరుస్తుండడం భారత శిబిరంలో ఆందోళన రేకెత్తిస్తోంది. 2013 పర్యటన సందర్భంగా రెండు వన్డేల్లో బ్యాటింగ్ చేసి 18, 19 పరుగులు... 2011లో ఐదు వన్డేల్లో 11, 9, 23, 1, 5 స్కోర్లు నమోదు చేశాడు. మొత్తంగా ఏడు మ్యాచుల్లో కలిపి 86 పరుగులే చేశాడంటే, సఫారీ గడ్డపై ఇతని ట్రాక్ రికార్డు ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పర్యటనలో తొలి రెండు వన్డేల్లోనూ (20, 15) ఘోరంగా విఫలమయ్యాడు.

మూడో వన్డేలో మార్పులు లేకుండానే బరిలోకి
వరుసగా రెండు వన్డేల్లోనూ గెలిచిన భారత్.. జట్టులో మార్పులేమీ లేకుండానే బరిలోకి దిగనుంది. ప్రస్తుతం ఉన్న జట్టు కూర్పును మార్చేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ సుముఖంగా లేకపోవడంతో రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు (అయ్యర్, పాండే, అక్షర్, దినేశ్, షమీ) మరో మ్యాచ్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. గత రెండు మ్యాచుల్లోనూ జట్టులో ఉన్న కేదార్ జాదవ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. దీంతో శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే మరోసారి పెవిలియన్‌కే పరిమితమవుతారు. ఇక కుల్దీప్, చాహల్ మ్యాచ్ విన్నర్లుగా మారడంతో వారిని కదిపే పరిస్థితే లేదు.

మూడో వన్డేలో హెన్రిచ్ అరంగేట్రం
మూడో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు తరుపున వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్ ఎంపిక విషయంలోనే దక్షిణాఫ్రికా తర్జనభర్జన పడుతోంది. ఇప్పటివరకు ఓపెనర్లుగా డీకాక్, ఆమ్లాలు బరిలోకి దిగేవారు. ఇప్పుడు డికాక్ స్థానంలో ఓపెనర్‌గా హెన్రిచ్ వస్తే.. రెండో స్థానంలో ఆమ్లా, మూడో స్థానంలో కెప్టెన్ మార్క్రమ్, నాలుగో స్థానంలో డుమినీ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మార్క్రమ్, ఆమ్లాతో ఓపెనింగ్ జోడీలో కుదిరితే.. హెన్రిచ్‌ను మిడిలార్డర్‌లో ఆడించే అవకాశం ఉంటుంది. కాగా, రెండో వన్డేలో ఇద్దరు స్పిన్నర్లతో ఆడగా మూడో వన్డేలో షమ్సిని పక్కనపెట్టి అతని స్థానంలో బెహార్డిన్‌ను ఆడించే అవకాశం ఉంది.

కోహ్లీసేనకు చరిత్ర సృష్టించే అవకాశం
సఫారీ గడ్డపై 1992 నుంచీ ఇప్పటివరకు టీమిండియా ఒక వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచిన దాఖలు లేదు. 2006లో 0-4, 2011లో 2-3, 2013లో 0-2తో వరుసగా సిరీస్‌లు కోల్పోయింది. ప్రస్తుతం ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన మూడోవన్డేలోనూ గెలిస్తే.. తొలిసారి సఫారీ గడ్డపై హ్యాట్రిక్ విజయాల రికార్డును సాధిస్తుంది. అంతేకాదు సిరీస్ కూడా చేజారిపోకుండా ఉంటుంది. కేప్ టౌన్‌లో భారత్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా భారత్ విజయాల సంఖ్య 2గా ఉంది. ఇక ఈ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికా 33 మ్యాచ్‌లు ఆడగా, దక్షిణాఫ్రికా 28 విజయాలను సొంతం చేసుకుంది.

పిచ్, వాతావరణం:
కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. పేసర్లకు స్వల్పంగా ప్రోత్సాహమిస్తుంది. ఎండ వేడిమి ఎక్కువగా ఉండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:
ఇండియా: Virat Kohli (capt), Shikhar Dhawan, Rohit Sharma, Ajinkya Rahane, Shreyas Iyer, Manish Pandey, Dinesh Karthik, Kedar Jadhav, MS Dhoni (wk), Hardik Pandya, Yuzvendra Chahal, Kuldeep Yadav, Axar Patel, Bhuvneshwar Kumar, Jasprit Bumrah, Mohammed Shami, Shardul Thakur.
దక్షిణాఫ్రికా: Aiden Markram, Hashim Amla, JP Duminy, Imran Tahir, David Miller, Morne Morkel, Chris Morris, Lungisani Ngidi, Andile Phehlukwayo, Kagiso Rabada, Tabraiz Shamsi, Khayelihle Zondo, Farhaan Behardien, Heinrich Klaasen (wk).
Match starts at: 4.30 pm IST
Live: Sony TEN


Click it and Unblock the Notifications











