Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టెస్టు: కోహ్లీసేన ప్రాక్టీస్, బెంగుళూరులో ఏమవుతుందో?

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శనివారం రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో 333 పరుగుల తేడాతో ఓటమి పాలైన కోహ్లీసేన రెండో టెస్టుని సీరియస్‌గా తీసుకుంది. రెండో టెస్టులో విజయం సాధించి సిరిస్‌ను సమం చేయాలని యోచనలో కోహ్లీసేన ఉంది.

ఇందులో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు శుక్రవారం తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. పూణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్‌లో పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్‌పైనే ఎక్కువ దృష్టి సారించారు.

టీమిండియా ప్రాక్టీస్

టీమిండియా ప్రాక్టీస్

శుక్రవారం నాడు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా బంతిని ఎలా పట్టుకోవాలి, ఎలా అడ్డుకోవాలి అనే దానిపై ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా బౌండరీ లైన్‌ వద్ద బంతిని క్యాచ్‌ పట్టడం ఎలా అనే అంశంపై క్రికెటర్లు క్యాచింగ్‌ డ్రిల్‌ నిర్వహించారు. క్రికెటర్ల క్యాచింగ్‌ డ్రిల్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌‌‌‌లో పోస్ట్ చేసింది.

గట్టి షాకిచ్చిన ఆసీస్

గట్టి షాకిచ్చిన ఆసీస్

పూణె టెస్టులో భారత్‌పై విజయం సాధించడం ద్వారా ఆసీస్ భారత్‌లో 12 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌ను నెగ్గింది. వరుసగా 19 టెస్టుల్లో విజయం సాధించి దూకుడు మీదున్న కోహ్లీ సేనకు కూడా స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ బ్రేక్ కూడా వేసింది. దీంతో స్వదేశంలో ఓటమి ఎరుగని భారత్‌కు ఆసీస్ రూపంలో గట్టి షాక్ ఎదురైందనే చెప్పాలి.

ప్రణాళికలను సిద్ధం చేసిన టీమిండియా

ప్రణాళికలను సిద్ధం చేసిన టీమిండియా

మరోవైపు బెంగుళూరు టెస్టులో విజయం సాధించి ఈ సిరిస్‌ను సొంతం చేసుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అందుకు తగిన విధంగా ఆసీస్ వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఓపెనర్లు దగ్గర్నుంచి, టెయిలెండర్ల వరకూ ఏ సమయాల్లో ఎలా ఆడాలి అనే దానిపై ఆస్ట్రేలియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.

బెంగుళూరు పిచ్ స్పిన్నర్లకు అనుకూలం

బెంగుళూరు పిచ్ స్పిన్నర్లకు అనుకూలం

ఇక బెంగుళూరు పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉండటంతో టీమిండియా ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఇక పూణె టెస్టులో రాణించిన ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్‌పై టీమిండియా సరైన ప్రణాళికలను సిద్ధం చేసింది. రెండో టెస్టులో ఎలాగైనా సరే ఓకీఫ్‌ను అధిగమించాలని చూస్తోంది.

అందరి దృష్టి కోహ్లీపైనే

అందరి దృష్టి కోహ్లీపైనే

తొలి టెస్టులో నిరాశపరిచిన విరాట్ కోహ్లీపైనే అందరి దృష్టి నెలకొంది. వరుసగా టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు చేసి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే ఆసీస్‌తో పూణెలో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 13 పరుగులు మాత్రమే చేశాడు.

ఇదీ బెంగుళూరు రికార్డు

ఇదీ బెంగుళూరు రికార్డు

తద్వారా కోహ్లీ స్వదేశంలో తొలిసారి చెత్త ప్రదర్శన చేశాడు. ఇదిలా ఉంటే బెంగుళూరులో ఇప్పటివరకూ 21 టెస్టులు జరిగాయి. ఇందులో టీమిండియా ఆరింటిలో విజయం సాధించగా, మరో ఆరింట ఓటమి పాలైంది. మిగతా తొమ్మిది టెస్టులు డ్రాగా ముగిసాయి. చివరిసారిగా 2015 నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+