Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోని సాధిస్తాడా?: ఒకవైపు దూకుడు, మరోవైపు ప్రతీకారం

ధర్మశాల: టెస్టు సిరిస్ ముగిసింది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ ఆటగాళ్లు ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలు నమోదైతే, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు కనీసం ఒక సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. అయితే టెస్టుల్లో విఫలమైన న్యూజిలాండ్‌ వన్డే ర్యాంకింగ్స్‌లో మాత్రం భారత్‌ కంటే ముందే ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వన్డే ర్యాకింగ్స్‌ల్లో న్యూజిలాండ్‌ మూడోస్థానంలో ఉండగా, టీమిండియా నాలుగోస్థానంలో కొనసాగుతోంది. టెస్టు సిరిస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మళ్లీ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకుంది. టెస్టు సిరిస్ ప్రతీకారంతో రగిలిపోతున్న న్యూజిలాండ్ వన్డే సిరిస్‌లో పగ తీర్చుకోవాలనుంది.

ఆట తీరు అద్భుతం: కోహ్లీకి అనుకోని అతిథి ప్రశంస

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే ఆదివారం ధర్మశాలలో మొదలవనుంది. టెస్టు సిరీస్‌లో దూకుడే ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగిన టీమిండియా.. వన్డేల్లోనూ అదే దూకుడుని ప్రదర్శించాలనే ఆలోచనలో ఉన్నట్లు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రహానే శుక్రవారం ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.

టెస్టులు ఓకే: తొలి వన్డే ఎంతో కీలకమన్న రహానే

 టెస్టుల్లో కోహ్లీ సేన అద్భుతమైన ప్రదర్శన

టెస్టుల్లో కోహ్లీ సేన అద్భుతమైన ప్రదర్శన

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో కోహ్లీ సేన అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది నాలుగో సిరీస్‌ విజయం. ఇప్పుడు ధోని వంతు వచ్చింది. 014లో టెస్టులకు ధోనీ గుడ్‌బై చెప్పిన తర్వాత పగ్గాలందుకున్న విరాట్‌ ఒక్క సిరీస్‌ కూడా ఓడిపోలేదు. గతేడాది వన్డే వరల్డ్‌క్‌ప్‌లో సెమీస్‌లో ఓడిన ధోనీసేన ఆ తర్వాత ఒక్క వన్డే సిరీస్‌లో మాత్రమే గెలిచింది.

 కెప్టెన్ ధోనిపై తీవ్ర విమర్శలు

కెప్టెన్ ధోనిపై తీవ్ర విమర్శలు

అది జింబాబ్వేపై. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పాటు బంగ్లాదేశ్‌ చేతిలో కూడా ఓడిపోవడంతో కెప్టెన్ ధోనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వరల్డ్‌కప్‌ తర్వాత 16 మ్యాచ్‌లాడిన ధోనీ 34.92 సగటుతో కేవలం 419 పరుగులు మాత్రమే చేశాడు. కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 92 నాటౌట్‌. ఈ 16 మ్యాచ్‌ల్లో భారత ఏడింట్లో నెగ్గి 9 వన్డేల్లో ఓడిపోయింది.

 జ్వరం కారణంగా సురష్ రైనా తొలి వన్డేకు దూరం

జ్వరం కారణంగా సురష్ రైనా తొలి వన్డేకు దూరం

గతేడాది స్వదేశంలో దక్షిణాఫ్రికాపై చివరి వన్డే ఆడిన సురేశ్‌ రైనాను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. రైనా అనుభవం, పార్ట్‌టైమ్‌ బౌలింగ్‌ చాలా మంది యువకులతో కూడిన జట్టుకు ఉపయోగపడుతుందని సిరీస్‌కు టీమ్‌ను ఎంపిక చేసే సమయంలో చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే జ్వరం కారణంగా తొలి వన్డేకు రైనా దూరమయ్యాడు.

 మన్‌దీప్‌ సింగ్‌ చక్కని అవకాశం

మన్‌దీప్‌ సింగ్‌ చక్కని అవకాశం

రోహిత్‌కు ఓపెనింగ్‌ జోడీగా సెలెక్టర్లు మన్‌దీప్‌ సింగ్‌ను ఎంపిక చేశారు. ఇది అతనికి చక్కని అవకాశం. ఈ ఏడాది జింబాబ్వే పర్యటనకు వెళ్లిన మన్‌దీప్‌ సింగ్‌ మూడు టీ-20లు ఆడి ఓ అర్ధ సెంచరీ కూడా సాధించాడు. ఇటీవల ఆస్ట్రేలియాలో నాలుగు దేశాల సిరీస్‌లో భారత-ఎ తరపున బరిలోకి దిగిన అతను ఆరు మ్యాచ్‌ల్లో 198 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫైనల్లో 95 పరుగులతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా కూడా నిలిచాడు.

 గుప్టిల్‌ పైనే న్యూజిలాండ్ ఆశలన్నీ

గుప్టిల్‌ పైనే న్యూజిలాండ్ ఆశలన్నీ

న్యూజిలాండ్ ఓపెనర్‌ మార్టిన్‌ గుప్టిల్‌ ప్రదర్శనపై కివీస్‌ ఆశలు పెట్టుకుంది. కానీ, ఈ విధ్వంసకర ఓపెనర్‌ టెస్టు సిరీస్‌లో తీవ్రంగా విఫలమయ్యాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవ లం 159 పరుగులతో సరిపెట్టిన గప్టిల్‌ వన్డేల్లోనైనా మెరవాలని న్యూజిలాండ్ కోరుకుంటోంది. వన్డేల్లో 237 నాటౌట్‌, 189 నాటౌట్‌ లాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌ను గతంలో గుప్టిల్ బ్యాట్ నుంచి జాలువారాయి.

 న్యూజిలాండ్‌పై భారత్‌దే పైచేయి

న్యూజిలాండ్‌పై భారత్‌దే పైచేయి

భారత్‌లో జరిగిన ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌కు 18-11తో మెరుగైన రికార్డు ఉంది. కానీ, మన దేశంలో ఆ జట్టు ఇప్పటిదాకా ఒక్క వన్డే సిరీస్‌ను కూడా నెగ్గలేదు. 1988, 1995, 1999, 2010 సంవత్సరాల్లో ఇరు జట్ల మధ్య నాలుగు సిరీస్‌లు జరిగాయి. అన్నింటిలోనూ భారత్‌దే విజయం. పైగా, చివరి సిరిస్‌లో ఐదు మ్యాచ్‌లూ నెగ్గిన టీమిండియా కివీస్‌ను వైట్‌వాష్‌ చేసింది.

 జట్లు

జట్లు

ఇండియా: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రోహిత్ శర్మ, మనీష్ పాండే, జయంత్ యాదవ్, తరచుగా పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కేదార్ యాదవ్, మన్దీప్ సింగ్, అమిత్ మిశ్రా, ధావల్ కులకర్ణి, ఉమేష్ యాదవ్, హార్ధిక్ పాండ్య, సురేష్ రైనా .

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కోరీ ఆండర్సన్, ట్రెంట్ బౌల్ట్, డగ్ బ్రేస్వెల్, Devsic, బ్రేస్వెల్, టామ్ లాథం, మాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, లూకా రాంచీ (వికెట్ కీపర్), మైఖేల్ సట్నర్, సోదీ, రాస్ టేలర్, బీజే వాట్లింగ్, టిమ్ సోధీ

న్యూజిలాండ్-భారత్ వన్డే సిరీస్‌ షెడ్యూల్‌

అక్టోబర్‌16 తొలి వన్డే ధర్మశాల

20 రెండో వన్డే న్యూఢిల్లీ

23 ముూడో వన్డే మొుహాలీ

26 నాలుగో వన్డే రాంచీ

29 ఐదో వన్డే విశాఖపట్నం

(అన్ని మ్యాచ్‌లు డే/నైట్‌ మ. 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం )

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+