Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనూహ్య సంఘటన: సఫారీలపై లంక ముందస్తు సంబరాలు (వీడియో)

హైదరాబాద్: కేప్ టౌన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 5 వికెట్లు తేడాతో శ్రీలంక విజయం సాధించి 2-1తో సిరిస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 171 పరుగులు చేసింది.

ఆ తర్వాత 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి ఓవర్లో 11 పరుగులు చేయాల్సి ఉంది. శ్రీలంక ఆటగాడు గుణరత్నే తొలి బంతిని ఫోర్ బాదాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో చివరి మూడు బంతుల్లో శ్రీలంక విజయానికి ఐదు పరుగులు కావాల్సి వచ్చింది.

rnrn

అనూహ్య సంఘటన: సఫారీలపై లంక ముందస్తు సంబరాలు (వీడియో)

నాలుగో బంతి బ్యాట్‌ ఎడ్జ్‌‌కు తగిలి అయ్యి బౌండరీకి వెళ్లింది. ఈ సమయంలో గుణరత్నే పరుగులను తప్పుగా లెక్కించి మ్యాచ్‌‌తో పాటు సిరిస్ గెలిచామని అనుకున్నాడు. ఇంకేముంది అనుకున్నదే తడవుగా పిడికిలి బిగించి గాల్లోకి చేత్తో గెలిచామంటూ చూపించడంతో పాటు వికెట్‌ను పీకి సిరీస్‌ మాదే అంటూ గట్టిగా అరిచాడు.

విజయానికి మరో పరుగు మిగిలుంది

విజయానికి మరో పరుగు మిగిలుంది

ఇదే సమయంలో మ్యాచ్‌లో విజయం సాధించడానికి మరో పరుగు మిగిలుందని క్రీజులో అవతలి ఎండ్‌లో ఉన్న మరో బ్యాట్స్‌మెన్‌ రత్నేకు చెప్పాడు. పరుగులను లెక్కించడంలో తప్పిదం జరిగిందటూ అంపైర్‌‌కు ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ వివరించాడు.

సింగిల్ తీసి సిరీస్‌ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు

సింగిల్ తీసి సిరీస్‌ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు

విజయానికి మిగిలిన ఒక్క పరుగు కోసం మరో బంతితో సింగిల్ తీసి సిరీస్‌ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌‌చల్‌ చేస్తోంది.

ఐసీసీ వరల్డ్ టీ20లో ముఫ్తికర్ రహీం ఇలానే

ఐసీసీ వరల్డ్ టీ20లో ముఫ్తికర్ రహీం ఇలానే

2016 వరల్డ్ టీ20 వరల్డ్ కప్‌లో మూడు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముఫ్తికర్ రహీం ఇలానే ప్రవర్తించాడు. అయితే ఈ మ్యాచ్‌లో చివరకు బంగ్లాదేశ్‌పై భారత్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+