Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Preity Zinta: ప్రీతి.. ఎంత పని చేశావ్.. రూ.100 టీషర్టుతో మంట పుట్టించావ్!(వీడియో)

Preity Zinta: ఐపీఎల్ 2025లో భాగంగా ఏప్రిల్ 8వ తేదీన పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ సమయంలో పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా కూడా మైదానంలో ఉత్సాహంగా కనిపించారు. ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రీతి జింటా మైదానంలోని అభిమానులను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.

అందులో భాగంగా మైదానంలో ఆటను చూస్తున్న పంజాబ్ కింగ్స్ అభిమానులను పలకరించారు. తన ఫోన్ లో అభిమానుల ఫోటోను తీసుకున్నారు. అనంతరం పంజాబ్ కింగ్స్ టీషర్టు ఒకదానిని అభిమానుల కోసం విసిరేశారు. అప్పుడే అసలు గొడవ ప్రారంభమైంది. ప్రీతి జింటా విసిరిన ఒక టీషర్టు కోసం అభిమానులు పోటీపడ్డారు. ఆ టీషర్టు కోసం గందరగోళం ఏర్పడింది. రూ.100 విలువ చేసే ఆ టీషర్టు కోసం అభిమానులు మైదానంలోనే గొడవకు దిగారు. ఒకరిపైకి ఒకరు పిడిగుద్దులు కూడా కురిపించుకున్నారు. ఈ గొడవను సద్దుమణిగేలా చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కేవలం ప్రీతి జింటా విసిరిన రూ.100 విలువ చేసే టీషర్టు కోసం ఇంతటి గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Preity Zinta s Rs 100 T-shirt Creates Chaos at IPL 2025 Match Fans Fight for It

కేవలం రూ.100 విలువ చేసే టీషర్టు ఇంతలా గొడవపడాలా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రీతి ఎంతపని చేశావ్.. ఒక్క టీషర్టు ఇచ్చి పెద్ద గొడవ పెట్టావ్ అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అభిమానం మన దేశంలోనే ఉంటుందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే కుక్కకు బొక్క దొరికినట్లు ఆ గొడవలేంట్రా.. అంటూ మండిపడ్డారు.

Story first published: Friday, April 11, 2025, 18:14 [IST]
Other articles published on Apr 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+