Preity Zinta: ఐపీఎల్ క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఐపీఎల్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. జూన్ 3న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 203 పరుగులు చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. పంజాబ్ తరఫున కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 నాటౌట్)విధ్వంసకర బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ జట్టు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది.
వేడుకల్లో మునిగిపోయిన ప్రీతి జింటా
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన జట్టును గెలిపించిన వెంటనే పంజాబ్ కింగ్స్ డగౌట్ సంబరాల్లో మునిగిపోయింది. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌తో సహా జట్టులోని అందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆనందంలో మునిగిపోయారు. స్టాండ్స్‌లో ఉన్న ప్రీతి జింటా, సహ యజమాని నెస్ వాడియా కూడా ఆనందంతో నృత్యం చేస్తూ విజయాన్ని జరుపుకున్నారు. బాలీవుడ్ నటి ప్రీతి జింటా తన చేతులను గాల్లోకో పైకెత్తి దూకుతూ మైదానం వైపు పరిగెత్తింది.

ముంబై ఇండియన్స్ జట్టుపై పంజాబ్ గెలిచాక ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో తిరుగుతూ సందడి చేశారు. ఇంతలో ప్రీతి జింటా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక పంజాబ్ కింగ్స్ సంబరాల మధ్య ప్రజెంటేషన్ సమయంలో ప్రీతి జింటా ఆటగాళ్లలో ఒకరి వైపు చూసి కన్నుగీటిన వీడియో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో పంజాబ్ కింగ్స్ యువ బ్యాటర్ అక్కడ నిల్చుని ఉండగా.. ప్రీతి జింటా జట్టును సరిచేసుకుంటూ.. ఆ యువ ఆటగాడివైపు కన్నుగీటుతూ ముందుకు సాగింది. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇప్పుడు వైరలవుతోంది. అయితే ఆమె నేహాల్ వధేరా వైపు కన్నుగీటారా లేదా అతని వెనుక మరెవరైనా ఉన్నారా అనేది స్ఫష్టంగా తెలియరాలేదు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రీతి జింటాను చూసినవాళ్లు ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటారు. ఎందుకంటే ఐదు పదుల వయసులోనూ ఆమె అందంతో అభిమానులను కట్టిపడేస్తున్నారు.
ప్రీతి జింటా మైదానం చేరుకున్న తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌ను కౌగిలించుకుంది. వారిద్దరితో విజయం గురించి కాసేపు ఆనందంగా మాట్లాడింది. రికీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ ఈ సీజన్‌లో జట్టుతో అనుబంధం కలిగి ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తొలగించబడిన తర్వాత పంజాబ్ కింగ్స్ రికీ పాంటింగ్‌ను తమ ప్రధాన కోచ్‌గా చేసింది. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. రికీ పాంటింగ్, శ్రేయస్ అయ్యర్ జంట ఇప్పుడు పంజాబ్ జట్టుకు మొదటి టైటిల్ ను అందించడానికి అడుగు దూరంలో ఉంది.