Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రీతి జింటా X కావ్య మారన్.. అందంలో ఆమే బెస్ట్!

IPL 2025: శనివారం ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఆ జట్టు ఓపెనర్లు దూకుడుగా పరుగులు సాధించారు. కానీ మ్యాచ్ చూడటం కంటే ప్రీతి జింటాను ప్రత్యక్షప్రసారంలో చూడటానికి నెటిజన్లు ఉత్సాహంగా ఉన్నారు. ప్రీతి జింటా గురించి వివిధ పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ కంటే ప్రీతి జింటా అందంగా ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పటి నుంచి అభిమానులలో ఈ చర్చ కొనసాగుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ సిరీస్ అంతంత మాత్రంగానే ఉందని కొందరు నెట్టింట కామెంట్లు చేస్తుండగా.. మరికొంత మంది నెటిజన్ల దృష్టి ప్రీతి జింటా, కావ్యమారన్ అందం వైపు మళ్లింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడల్లా.. జట్ల గురించి కంటే ఆ జట్ల యజమానులు ప్రీతి జింటా, కావ్య మారన్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. జట్లు మ్యాచ్ గెలవడం గురించి పోటీ పడుతుంటే.. అందంలో వీరిద్దరు పోటి పడుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Preity Zinta vs Kavya Maran IPL 2025 Beauty Battle Takes Over Social Media

శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుతంగా ఆడారు. ప్రియాన్ష్ ఆర్య 35 బంతుల్లో 4 సిక్సర్లు, 8 ఫోర్లతో 69 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 49 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 120 పరుగులు జోడించారు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు అర్థ సెంచరీలు, సిక్సర్లు బాదినప్పుడు జట్టు యజమాని ప్రీతి జింటా లేచి నిలబడి చప్పట్లు కొట్టే దృశ్యాలను ప్రత్యక్షప్రసారం చేసినప్పుడు అభిమానులు ఆమె అందాన్ని ప్రశంసించారు. 'ప్రీతి దేవుడి సృష్టిలలో అత్యంత అందమైనది' అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. మరొకరు'ప్రీతి అత్యంత అందమైన ఐపీఎల్ యజమాని' అని అన్నారు. ప్రీతి జింటా ఎల్లప్పుడూ ఒకేలా కనిపిస్తుందని మరొక అభిమాని అన్నాడు. ఆమె వృద్ధాప్యంలో కూడా అందంగా ఉంటుందని మరొకరు అన్నారు. కొంత మంది అభిమానులు 'ఈడెన్ గార్డెన్ లో అందమైన ప్రీతి జింటా' అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక ఓవర్ లో 7 పరుగులు చేయడంతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడింది. రెండు జట్లకు చెరొక పాయింట్ లభించింది.

Story first published: Sunday, April 27, 2025, 14:01 [IST]
Other articles published on Apr 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+