ఆటగాడికి అందమైన కౌగిలి.. ఆపై చిలిపి దెబ్బ! (వీడియో)
ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 25న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు అద్భుతం చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యమైన 265 పరుగులను ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ జట్టు 13 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ప్రియాన్ష్ ఆర్యతో ప్రీతి జింటా సరదా
మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను అభినందించారు. ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యను కలిసినప్పుడు జరిగిన ఓ ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రీతి జింటా ముందుగా ప్రియాన్ష్ ఆర్యను ప్రేమగా హగ్ చేసుకున్నారు. ఆ వెంటనే సరదాగా.. ఆటపట్టిస్తూ అతని కడుపులో ఓ పంచ్ ఇచ్చారు. అయితే ఆ పంచ్ తగిలిన వెంటనే ప్రియాన్ష్ ఆర్య కాస్త నొప్పితో ఉన్నట్లు కనిపించారు. వీడియోలో ప్రియాన్ష్ ఆర్య లిప్ మూమెంట్ గమనిస్తే.. మ్యాచ్ సమయంలో తనకి అక్కడే బంతి తగిలిందని.. ఇప్పుడు మీరు కూడా అక్కడే కొట్టారని ఆమెతో చెబుతున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్ 152 పరుగులతో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. నితీష్ రాణా 91 పరుగులతో చెలరేగాడు. అయితే ఇంత భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే (18.5 ఓవర్లలో) ఛేదించింది. పంజాబ్ తరపున ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 76 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రియాన్ష్ ఆర్య మెరుపు వేగంతో 41 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అభిమానుల స్పందన
పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా తన జట్టు ఆటగాళ్లతో ఎప్పుడూ ఎంతో ఆత్మీయంగా మెలుగుతుంటారు. ఈ వీడియో చూసిన అభిమానులు "ప్రీతి జింటా ఎనర్జీ అదిరిపోయింది" అని కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు "పాపం ప్రియాన్ష్ ఆర్యకు దెబ్బ తగిలిన చోటే కొట్టింది" అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పంజాబ్ వరుస విజయాలతో దూసుకుపోతుండటంతో యాజమాన్యం, అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications