రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
రోహిత్ శర్మ గురించి తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదని పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా పేర్కొన్నారు. వచ్చే మెగా వేలంలో రోహిత్ దక్కించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. హిట్‌మ్యాన్‌ను సొంతం చేసుకోవాలని ఏ ఇంటర్వ్యూలోనే తాను వెల్లడించలేదని ప్రీతి జింటా క్లారిటీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..రోహిత్ శర్మ కోసం తన జీవితాన్ని పందెంగా వేయడానికి ప్రీతి జింటా సిద్ధంగా ఉందని తెలిపిందంటూ వార్తలు వచ్చాయి. ''మెగా వేలానికి రోహిత్ శర్మ వస్తే..అతని కోసం నా జీవితాన్ని పందెంగా వేస్తాను. జట్టులో స్థిరత్వాన్ని తీసుకువచ్చే, ఛాంపియన్ మైండ్ సెట్‌ను కలిగి ఉండే కెప్టెన్‌ను మేం మిస్ అవుతున్నాం'' అని ప్రీతి జింటా పేర్కొందంటూ కథనాలు వెల్లువెత్తాయి.

తాజాగా దీనిపై ప్రీతి జింటా స్పందించింది. ''ఇది ఫేక్ న్యూస్. ఈ కథనాలన్నీ నిరాధారమైనవి. రోహిత్ శర్మ అంటే ఎంతో గౌరవం ఉంది. అతనికి నేను అభిమానిని కూడా. అంతేకానీ ఏ ఇంటర్వ్యూలో అతని గురించి నేను చర్చించలేదు. ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఇక శిఖర్ ధావన్ అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ప్రస్తుతం అతను గాయపడ్డాడు. ఈ స్థితిలో ఈ కథనాలు చాలా దారుణంగా ఉన్నాయి''
''ఎలాంటి ధృవీకరణ లేకుండా, ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం ఎలా చక్కర్లు కొడుతుందని చెప్పడానికి ఇది సరైన ఉదాహరణ. ఇలాంటి వాటిని ప్రచారం చేసి ఇబ్బంది పెట్టకూడదని మీడియాను కోరుతున్నాను. మొత్తంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే.. ప్రస్తుతం మా వద్ద గొప్ప జట్టు ఉంది. ఇప్పుడు మా దృష్టి అంతా మ్యాచ్‌లు గెలవడమే'' అని ప్రీతి జింటా ట్వీట్ చేశారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ భుజానికి గాయమవ్వడంతో గత కొన్ని రోజులుగా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ధావన్ గైర్హాజరీలో సామ్ కరన్ జట్టును నడిపిస్తున్నాడు. మరోవైపు కెప్టెన్సీ మార్పు వివాదంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ ముంబై వీడనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రోహిత్ గురించి ప్రీతి జింటా వ్యాఖ్యలు చేసిందంటూ వచ్చిన వార్తలు చక్కర్లు కొట్టాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications