Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: ఐపీఎల్ 2014లో తన విజయరహస్యాన్ని బయటపెట్టిన ప్రీతి జింటా

Indian Premiere League: ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్‌ను గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అని పిలిచేవారు. ఈ జట్టు 2008 నుంచి ఐపీఎల్ లో ఆడుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో చెత్త ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే.. పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో ఉంది. 100 కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన జట్లలో పంజాబ్ అతి తక్కువ విజయాలు సాధించింది. పంజాబ్ కింగ్స్ గెలుపు శాతం కూడా అధ్వాన్నంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది.

ఒక్కసారి మాత్రమే ఫైనల్ కు చేరిన పంజాబ్
పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ లోని 17 సీజన్లలోనూ పాల్గొంది. ఈ కాలంలో ఆ జట్టు రెండు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. 2008లో మొదటి సీజన్ లో ఆ జట్టు చివరి నాలుగు స్థానాల్లోకి చేరుకుంది. ఆ తర్వాత 2014లో ఫైనల్స్ కు చేరుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. వృద్ధిమాన్ సాహా సెంచరీ తర్వాత కూడా పంజాబ్ జట్టు ఆ మ్యాచ్ గెలవలేకపోయింది.

Preity Zinta Reveals the Secret Behind Punjab Kings Success in IPL 2014

2014 విజయరహస్యాన్ని బయటపెట్టిన ప్రీతి జింటా
2014లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయానికి గల ప్రధాన కారణాలను ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా వెల్లడించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఒక యూజర్ పోస్ట్ కు సమాధానం ఇస్తూ ఇలా చెప్పుకొచ్చారు. మొదటి ఆరు ఓవర్లలో అద్భుతమైన బ్యాటింగ్, జార్జ్ బెయిలీ అద్భుతమైన కెప్టెన్సీ, యజమానుల జోక్యం లేకపోవడం, జట్టులో చాలా తక్కువ మార్పులు ఈ విజయానికి కారణమని ప్రీతి జింటా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అద్భుతమైన బౌలింగ్, జట్టు బాగా ఆడడం, మాక్సీ-మిల్లర్ గొప్ప పార్టనర్ షిప్ వల్లే ఫైనల్ వరకు వెళ్లగలిగామని ప్రీతి జింటా చెప్పుకొచ్చారు.

పంజాబ్ కు మంచి కెప్టెన్ దొరికాడు..
పంజాబ్ కింగ్స్ ఎప్పుట్నుంచో బెస్ట్ కెప్టెన్ కోసం వెతుకుతోంది. కానీ ఎప్పుడూ ఉత్తమ కెప్టెన్ పంజాబ్ కింగ్స్ కు లభించలేదు. ఈ సారి పంజాబ్ కింగ్స్ కు విజయవంతమైన కెప్టెన్ దొరికాడు. ఐపీఎల్ 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేసింది. 2024లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్ కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిచింది. అంతకు ముందు శ్రేయస్ ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. గత దేశీయ క్రికెట్ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ముంబై సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకుంది.

Story first published: Friday, February 28, 2025, 9:33 [IST]
Other articles published on Feb 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+