Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Preity Zinta: ఓనర్స్ అంటే ఇలా ఉండాలి మావా.. ప్రియాన్ష్ ఆర్యతో ఏం చేసిందో చూడండి!

Preity Zinta: ఓ వైపు ఐపీఎల్ జట్ల యజమానులు తమ ఆటగాళ్లను తిట్టడం లేదా మందలించడం లేదా విభేదాలు కలిగి ఉండటం ద్వారా వార్తల్లో నిలుస్తుండగా.. మరోవైపు బాలీవుడ్ స్టార్ ప్రీతి జింటా అందరి కంటే భిన్నంగా కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తరచుగా తన ఆటగాళ్లను ప్రశంసిస్తూ కనిపిస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై సెంచరీ సాధించడం ద్వారా జట్టు విజయానికి కారణమైన ప్రియాన్ష్ ఆర్యను ప్రీతి జింటా ప్రశంసించారు. తన ఐపీఎల్ కెరీర్‌లో నాలుగో మ్యాచ్ ఆడిన ప్రియాన్ష్ ఆర్య 42 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ప్రియాన్ష్ 7 ఫోర్లు,9 సిక్సర్లు బాదాడు. ప్రియాన్ష్ ఆర్య స్ట్రైక్ రేట్ 245 కంటే ఎక్కువగా ఉంది. ప్రియాన్ష్ ఆర్య బ్యాటింగ్ చేస్తుండగా ప్రీతి జింటా ఆనందంతో డ్యాన్స్ చేసింది. ప్రీతి సంతోషంతో గంతులేసింది.

సీఎస్కేపై అద్బుతమైన సెంచరీ సాధించి యువ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యను ప్రీతి జింటా ప్రశంసించింది. తన నాలుగో ఐపీఎల్ మ్యాచ్ లో ప్రియాన్ష్ 42 బంతుల్లో 103 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్‌ను విజయపథంలో నడిపించాడు. ప్రీతి జింటా ప్రియాన్ష్ ఆర్యతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పంజాబ్ కింగ్స్ కు "ఒక స్టార్ దొరికాడు" అంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రియాన్ష్ ఆర్య కూడా తన విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. అది తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని అన్నాడు. జట్టులోని సానుకూల వాతావరణం గురించి, సీనియర్ ఆటగాళ్ల నుంచి తనకు లభించే మద్దతు గురించి కూడా ప్రియాన్ష్ ఆర్య మాట్లాడాడు.

Preity Zinta Praises Priyansh Arya s Century Against CSK

ప్రీతి జింటా సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. "మంగళవారం రాత్రి చాలా ప్రత్యేకమైనది. మేము గొప్ప క్రికెట్ మ్యాచ్ ను చూశాము. ఒక లెజెండ్ గర్జన విన్నాం. ఒక ప్రకాశవంతమైన స్టార్ పుట్టుకను చూశాం. నేను కొన్ని రోజుల క్రితం 24 ఏళ్ల ప్రియాన్ష్ ఆర్యను, మా జట్టులోని మరికొందరు యువ ఆటగాళ్లను కలిశాను. అప్పుడు ప్రియాన్ష్ నిశ్శబ్ధంగా, నిరాడంబరంగా ఉన్నాడు. సాయంత్రం అంతా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రియాన్ష్ ఆర్యను చూసి చాలా గర్వపడుతున్నాను. మాటల కంటే చేతలు ముఖ్యమని ప్రియాన్ష్ నిరూపించాడు. " అని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.

Story first published: Thursday, April 10, 2025, 17:36 [IST]
Other articles published on Apr 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+