ఆ క్యాచ్ హైలెట్: ప్రీతి జింటా ఇలా మురిపించింది (ఫొటోలు)
పూణే: శుక్రవారం జరిగిన ఐపియల్ మ్యాచులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమి చవి చూసింది. అయితే, పూణే ప్రేక్షకులను మాత్రం సినీ తార ప్రీతి జింటా మురిపించింది. రాజస్తాన్ రాయల్స్ పంజాబ్‌ను 26 పరుగుల తేడాతో ఓడించింది.
రాజస్థాన్ రాయల్స్ తమ ముందు ఉంచిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.
రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచి పంజాబ్‌కు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఫాల్క్‌నర్ వేసిన 19వ ఓవర్ ఆఖరి బంతికి సౌథీ, కరుణ్ నాయర్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ పట్టారు.
బెయిలీ కొట్టిన బంతిని బౌండ్రీ లైన్ వద్ద సౌథీ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే, బ్యాలెన్స్ తప్పిన సౌథీ బౌండ్రీ లైన్ దాటేయబోతూ బంతిని లోపలికి విసిరేశాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న కరణ్ డైవ్ చేస్తూ బంతి కిందపడకుండా ఒంటి చేత్తో పట్టుకున్నాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది.

మురిపించిన ప్రీతి జింటా
తన జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమి చవి చూసిననప్పటికీ ప్రీతి జింటా పూణే ప్రేక్షకులను మురిపించారు.

మురళీ విజయ్ కష్టపడినా...
మురళీ విజయ్ కష్టపడినా పంజాబ్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.

సెహ్వాగ్ వెనక్కి మళ్లుతూ..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పెవిలియన్‌కు దారి తీస్తూ ఇలా....

వికెట్ తీసుకున్న జాన్సన్
స్టువర్ట్ బిన్నీ వికెట్ పడగొట్టిన ఆనందంలో ఎగిరి గంతేసిన మిచెల్ జాన్సన్

స్టీవెన్ స్మిత్ షాట్ కొడ్తూ...
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్ వేసిన బంతిని ఈడ్చి కొడుతూ ఇలా...
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications