For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీతో నేను మాట్లాడింది అదే: ప్రీతి జింటా

Virat Kohli: ఐపీఎల్ 2025లో భాగంగా రీసెంట్ గా జరిగిన మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడగా.. చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్, దిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియంలో ఆర్సీబీ విజయం సాధించాయి. అయితే దిల్లీ స్టేడియంలో ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత ప్రీతి జింటా - విరాట్ కోహ్లీ కలిసి ఏదో మాట్లాడుకున్నట్లుగా కనిపించారు. ఒకరి ఫోన్ ను మరొకరు చూపించుకుంటూ ముచ్చటించారు . తాజాగా తామిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఆ సంభాషణను బయటపెట్టింది ప్రీతి జింటా. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏం మాట్లాడుకున్నారబ్బా..
ఈ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు జట్టులో బ్యాటుతో విరాట్ కోహ్లీ (51), కృనాల్ పాండ్య (73), బంతితో భువనేశ్వర్ కుమార్, హెజిల్ వుడ్ కీలకంగా వ్యవహరించారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లి ప్లేఆఫ్స్ కు దగ్గరైంది. దీంతో ఈ విజయం తర్వాత ప్రీతి జింటా - కోహ్లీని కలిసి అభినందనలు తెలిపింది. అయితే ఈ ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకున్న సందర్భం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారా అని క్రికెట్ అభిమానులు తెగ ఆరా తీశారు.

Preity Zinta opens up On Her chat With Virat Kohli After RCB won against PBKS IPL 2025
Photo Credit: twitter screenshot

కోహ్లీ.. అప్పుడు అలా-ఇప్పుడు ఇలా. .
ఈ క్రమంలోనే ప్రీతి జింటా సోషల్ మీడియాలో తామిద్దరి సంభాషణను తెలిపింది. "మేమిద్దరం మా పిల్లల ఫొటోలను ఒకరినొకరికి చూపించుకున్నాం. వాళ్ల గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయాం! కాలం ఎంత త్వరగా పరిగెడుతుందో... 18 ఏళ్ల క్రితం నేను విరాట్‌ కోహ్లీని మొదటిసారి కలిసినప్పుడు, అతడు ఎంతో ఉత్సాహం కలిగిన యువకుడు. ప్రతిభతో పాటు మంచి దూకుడు, ఫైర్ ఉన్న కుర్రాడు. ఇప్పటికీ అదే ఫైర్, అదే ప్యాషన్ అతడిలో ఉంది. ఇప్పుడు అతడు ఒక ఐకాన్ మాత్రమే కాదు.. తన పిల్లల్ని ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునే వెరీ స్వీట్ ఫాదర్ కూడా." అంటూ రాసుకొచ్చింది.

Story first published: Monday, April 28, 2025, 21:42 [IST]
Other articles published on Apr 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+