Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రీతి జింతా గట్టిగానే తగులుకుంది..!!

ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దుమ్ము దులిపింది. వరుసగా రెండో ఏడాది కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించింది. 23 పరుగుల తేడాతో టైటిల్ హాట్ ఫేవరెట్ గా సీజన్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించింది. తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో టేబుల్ టాపర్ గా ఎదగడమే కాకుండా ప్లేఆఫ్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.

పంజాబ్ కింగ్స్ వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూడాల్సి రావడం ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలకు తీవ్రంగా దెబ్బకొట్టింది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లేఆఫ్ ఛాన్సులు సంక్లిష్టం అయ్యాయి. ఈ కీలక ఓటమి అనంతరం పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింతా, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో తీవ్ర స్థాయిలో మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ సమయంలో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఒంటరిగా తలదించుకుని కనిపించారు.

Preity Zinta Explosive Moment Punjab Kings Owner Scolds Captain Shreyas Iyer After 6th Straight Loss

సీజన్ ప్రారంభంలో అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోయిన ఈ జట్టు.. ఇప్పుడు వరుసగా మ్యాచ్‌లను చేజార్చుకోవడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఈ ఐపీఎల్ సీజన్ తొలి భాగంలో పంజాబ్ కింగ్స్ అజేయంగా నిలిచింది. ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించి, ఒక మ్యాచ్ రద్దుతో ఒక్క పరాజయం కూడా లేకుండా దూసుకుపోయింది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. వరుసగా ఆరు మ్యాచ్ లల్లో ఓటమి పాలైంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ 40 బంతుల్లో 73, విరాట్ కోహ్లీ 58 పరుగులు చేశారు. కఠినమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. శశాంక్ సింగ్ 56 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా అవతరించింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబ్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ డగౌట్‌లో తీవ్ర నిరాశతో ఒంటరిగా కూర్చుండిపోయారు. అతని ముఖంలో కనిపించిన నిరాశ పంజాబ్ జట్టు ప్రస్తుత స్థితిని స్పష్టంగా ప్రతిబింబించింది. అనేక వ్యూహాలు పన్నినా జట్టుకు వరుస ఓటములు ఎదురు కావడం ఆయనను కలవరపరిచింది. అదే సమయంలో, ప్రీతి జింతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో సీరియస్ గా మాట్లాడుతుండం కనిపించింది.

జట్టు బౌలింగ్ వైఫల్యాలు, బ్యాటింగ్‌లో జరిగిన తప్పులపై గురించి ఆమె శ్రేయాస్ అయ్యర్ ను నిలదీసినట్లు చెబుతున్నారు. మళ్లీ లీగ్ దశలోనే కప్ సాధించకుండానే నిష్క్రమించే పరిస్థితి ఏర్పడటం ప్రీతి జింతాను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ప్లేఆఫ్స్ చేరాలంటే.. తన తదుపరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించి తీరాలి. అలాగే ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం 13 పాయింట్లే ఉన్నాయి పంజాబ్ వద్ద. ఇంకో మ్యాచ్ మిగిలివుంది.

Story first published: Monday, May 18, 2026, 15:23 [IST]
Other articles published on May 18, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+