Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Preity Zinta: వైభవ్ సూర్యవంశీకి హగ్.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి జింటా!

Preity Zinta: ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు యజమానుల్లో ఒకరైన ప్రీతి జింటా రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న 14 ఏళ్ల ఆటగాడు వైభవ్ సూర్యవంశీని కౌగిలించుకుని ప్రశంసిస్తున్నట్లు చూపించే కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అయితే ప్రీతి జింటా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని వెల్లడించింది.

ఐపీఎల్ 2025లో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా అతను నిలిచాడు. 14 సంవత్సరాల వయసులో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి అడుగుపెట్టడమే కాకుండా అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. వైభవ్ 35 బంతుల్లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.

Preity Zinta Clarifies on Morphed Hug Photo with Vaibhav Suryavanshi

ఈ క్రమంలో మే 18న పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్ జట్టు యజమానులలో ఒకరైన ప్రీతి జింటా ఆటగాళ్లందరినీ కలుసుకుని కరచాలనం చేసింది. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీని కూడా కలిశారు. ఆమె నిలబడి వైభవ్‌తో కాసేపు మాట్లాడింది. ఇది అధికారిక పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియా పేజీలలో ప్రచురించబడింది. అయితే ప్రీతిజింటా వీడియోలో ఎక్కడా వైభవ్ సూర్యవంశీని కౌగిలించుకోలేదు. అయితే హగ్ చేసుకున్నట్లుగా కొన్ని ఫోటోలు వివిధ వ్యక్తుల సోషల్ మీడియా పేజీలలో షేర్ చేయబడ్డాయి. కొన్ని మీడియా సంస్థలు ఆ ఫోటోను నిజమైన ఫోటోగా భావించి ప్రచురించాయి. ఆ ఫోటో చూసి ఆగ్రహించిన ప్రీతి జింటా, అది నకిలీ ఫోటో అని మండిపడింది. దీని గురించి ఆమె పోస్ట్ చేస్తూ.. "ఇది మార్ఫింగ్" చేసిన ఫోటో అని రాసుకొచ్చింది. అలాగే ఇది నకిలీ వార్త అని పేర్కొంది. ఇప్పుడు న్యూస్ ఛానెళ్లలో 'మార్ఫింగ్' చేసిన ఫోటోలు దర్శనమిస్తుండటం ఆశ్చర్యకరమని అన్నారు.

Story first published: Wednesday, May 21, 2025, 15:13 [IST]
Other articles published on May 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+