గర్భవతిగా ఉన్నా కూడా అనుష్క శర్మ సాహసం.. కోహ్లీతో కలిసి!!

Pregnant Anushka Sharma Performs Shirshasana With Virat Kohli's Support

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శ‌ర్మ ప్రస్తుతం గ‌ర్భంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. మరో నెల రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. గర్భవతిగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా కుదుర్చుకున్న ప్రాజెక్టుల్ని ఆమె దాదాపు పూర్తి చేశారు. మెటర్నటీ బ్రేక్‌కు ముందే వీలైనంత వరకు షూటింగ్స్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలోనూ ఫిట్‌గా ఉండటానికి కసరత్తులు కూడా చేశారు. విరాట్‌ కోహ్లీ ఆమెకు అండగా ఉన్నాడు. అయితే అనుష్క ఆరు నెల‌ల గ‌ర్భంతోనూ శీర్షాస‌నం వేసిన ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

అనుష్క శీర్షాస‌నం:

అనుష్క శీర్షాస‌నం:

విరాట్ కోహ్లీ ఇండియాలో ఉన్న స‌మ‌యంలో అనుష్క శ‌ర్మ శీర్షాస‌నం వేశారు. గోడ ఆధారంగా ఆమె తలకిందులుగా నిల్చోగా.. కోహ్లీ ముందు జాగ్రత్తగా కాళ్లు పట్టుకుని బ్యాలెన్స్‌ చేశాడు. ఆ ఫొటోను అనుష్క‌నే తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. త‌ల కిందికి, కాళ్లు పైకి పెట్టి చేసే ఈ ఆస‌నం చాలా క్లిష్ట‌మైన‌ద‌ని అనుష్క‌ కామెంట్ చేశారు. యోగా తన జీవితంలో భాగమని, గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఆసనాలు వేయడం సంతోషంగా ఉందన్నారు. అయితే వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం తప్పనిసరని ఆమె స్పష్టం చేశారు. త‌న యోగా టీచ‌ర్ ఈఫా ష్రాఫ్‌తో పాటు త‌న భ‌ర్త విరాట్ తాను ఈ శీర్షాస‌నం వేయ‌డానికి సాయం చేశార‌ని అనుష్క చెప్పుకొచ్చారు.

గర్భవతిగా వ్యాయామం చేస్తున్నా:

గర్భవతిగా వ్యాయామం చేస్తున్నా:

'చేతులు కిందికి పెట్టి, కాళ్లు పైకి ఎత్తే అతి కష్టమైన వ్యాయామం. ఇది పాత ఫొటో. యోగా నా జీవనశైలిలో ఓ భాగమైపోయింది. గర్భవతిగా ఓ స్థాయి వరకు.. గతంలో రోజూ వేసే ఆసనాలు చేయొచ్చని వైద్యులు సూచించారు. సపోర్ట్‌ తీసుకుని ఇలాంటి ఆసనాలు వేయమని సలహా ఇచ్చారు. శీర్షాసనాన్ని ఎన్నో ఏళ్ల నుంచి వేస్తున్నా. గర్భవతిగా వ్యాయామం చేస్తున్నా కాబట్టి గోడను ఆధారంగా తీసుకున్నా. బ్యాలెన్స్‌ చేయడానికి, మరింత జాగ్రత్త కోసం విరాట్ సాయం చేశాడు. నా యోగా శిక్షకురాలి పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వ్యాయామాన్ని కొనసాగించడం ఎంతో సంతోషంగా ఉంది' అని అనుష్క శర్మ పోస్ట్‌ చేశారు.

అనుష్క గ్రేట్:

అనుష్క గ్రేట్:

శీర్షాస‌నం వేసిన అనుష్క శర్మపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అత్యంత కఠినమైన వ్యాయామం చేసిన అనుష్క గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పుట్టబోయే బిడ్డ ఇంకా ఆరోగ్యంగా పుడుతుందంటున్నారు. శిశువుకు జన్మనిచ్చిన తర్వాత చిత్రీకరణలో పాల్గొంటానని, నటనలోనే తనకు ఆనందం దొరుకుతుందని అనుష్క ఇటీవల మీడియాతో అన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. మూడు వన్డేలు, మూడు టీ20లు, తొలి టెస్టు ముగిసిన తర్వాత పితృత్వ సెలవుపై అతడు భారత్‌కు తిరిగిరానున్నాడు. ప్రసవ సమయంలో అనుష్క వద్ద ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.

2017లో వివాహం:

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన విరాట్-అనుష్క.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. కోహ్లీతో వివాహం అయినప్పటి నుంచి 32 ఏళ్ల అనుష్క పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. అనుష్క వచ్చే ఏడాది జనవరి ముగిసేలోగా ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు.

మ‌రో 23 ప‌రుగులు.. సచిన్ అరుదైన రికార్డును బద్దలు కొట్టనున్న కోహ్లీ!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, December 1, 2020, 16:43 [IST]
Other articles published on Dec 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X