For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి: భారత స్పిన్నర్

Pravin Tambe says I had tears in my eyes when I received my first class cap from Wasim Jaffer

ముంబై: క్రికెట్ ఆటలో 40 ఏళ్ల చివరలో కూడా ఆటను కొనసాగించడం చాలా అరుదు. ఇటీవల భారత వెటరన్ ఆటగాడు, రంజీ దిగ్గజం వసీం జాఫర్ తన 42 ఏళ్ల వయసులో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే భారత సీనియర్ స్పిన్నర్ ప్రవీణ్ తంబే 48 సంవత్సరాల వయసులో కూడా ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో ఐపీఎల్-13 కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలోకి వచ్చిన తంబేని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ కొనుగోలు (రూ. 20 లక్షల కనీస ధర) చేయడంతో.. టోర్నీలో ఆడబోతున్న అత్యంత పెద్ద వయస్కుడిగా ప్రవీణ్ తంబే నిలవబోయాడు.

టీ10 లీగే కొంపముంచింది

టీ10 లీగే కొంపముంచింది

అయితే యూఏఈ వేదికగా జరిగిన టీ10లో లీగ్ ప్రవీణ్ తంబే ఆడడటంతో.. అతనిపై ఇటీవల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనర్హత వేటు వేసింది. ఈ నిర్ణయంతో తంబే ఐపీఎల్‌కి దూరమయ్యాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం... భారత క్రికెటర్లు ఎవరూ రిటైర్మెంట్ ప్రకటించకుండా విదేశీ టీ20 లీగ్‌లలో ఆడరాదు. అయితే టీ10 లీగ్‌లో ఆడేందుకు రిటైర్మెంట్ ప్రకటించిన తంబే.. ఆ టోర్నీ ఆడిన తర్వాత మళ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మాత్రం అతడి నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. దీంతో టీ10 లీగే మనోడి కొంపముంచింది.

ఎమోషనల్ అయ్యా

ఎమోషనల్ అయ్యా

ఐపీఎల్-13 వేలం సమయంలో నిత్యం వార్తల్లో నిలిచిన ప్రవీణ్ తంబే.. ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అరంగేట్రం సమయంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. 'నిజాయతీగా చెప్పాలంటే ఐపీఎల్‌లో ఆడటం కంటే.. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అరంగేట్రం సమయంలోనే ఎక్కువగా ఎమోషనల్ అయ్యా. వసీమ్ జాఫర్ నుంచి క్యాప్ అందుకునే సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ పెద్ద స్థాయిలో క్రికెట్ ఆడాలని కలలు కనలేదు. కానీ మనసు పెట్టి ఆడితే క్రికెట్ అన్నీ ఇస్తుందని ఆ క్షణం నాకు అనిపించింది' అని తంబే తెలిపాడు.

33 ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. 28 వికెట్లు

33 ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. 28 వికెట్లు

2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తంబే.. 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్‌ లయన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ తరపున కూడా ఆడాడు. బంతితో మెరిసినా.. బ్యాట్‌తో 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, ఆరు లిస్ట్-ఎ మ్యాచ్‌ల్ని తంబే ఆడాడు.

42 ఏళ్ల వయసులో హ్యాట్రిక్

42 ఏళ్ల వయసులో హ్యాట్రిక్

2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుపై తంబే హ్యాట్రిక్ సాధించాడు. తనను తాను 20 ఏళ్ల యువకుడిగా భావించుకుంటానని గత డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలం తర్వాత తెలిపాడు. యువకుడిగా మైదానంలోకి దిగుతానని.. తన అనుభవం, ఎనర్జీ కేకేఆర్‌ జట్టుకు ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. తుది జట్టులోకి తీసుకోకపోయినా, తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించాడు.

Story first published: Friday, March 20, 2020, 17:36 [IST]
Other articles published on Mar 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+