CPL 2020: తొలి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు!!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): ఐపీఎల్ వెటరన్ ఆటగాడు ప్రవీణ్ తాంబే.. వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్నకరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2020లో పాల్గొన్నాడు. దీంతో సీపీఎల్ లీగ్‌లో పాల్గొన్న తొలి భారత క్రికెటర్‌గా 48 ఏళ్ల తాంబే అరుదైన రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు సీపీఎల్‌లో భారత్ నుంచి ఏ క్రికెటర్ ఆడలేదు. సీపీఎల్‌లో భాగంగా బుధవారం ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, సెయింట్ లూసియా జూక్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచులో తాంబే ఆడాడు.

వికెట్ కూడా పడగొట్టాడు:
సీపీఎల్ టీ20 తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ప్రవీణ్ తాంబేకు స్వాగతం పలికింది. 'సీపీఎల్‌లోకి భారత్‌కు స్వాగతం. 48 ఏళ్ల యువ ఆటగాడైన తాంబే క్రికెట్ ప్రయాణం అద్భుతం' అని సీపీఎల్ టీ20 రాసుకొచ్చింది. ఈ ఏడాది జరుగుతున్న టోర్నీలో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున తాంబే బరిలోకి దిగాడు. సెయింట్ లూసియా జౌక్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో తుది జట్టులో ప్రవీణ్‌కు స్థానం లభించింది. ఒక ఓవర్ వేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. అయితే 15 పరుగులు ఇచ్చుకోవడం కాస్త ఆందోళన కలిగించే విషయం.

టీ10 లీగ్‌లో పాల్గొనడంతో:
గతేడాది షార్జాలో జరిగిన టీ10 లీగ్‌లో ప్రవీణ్ తాంబే పాల్గొన్నాడు. దీంతో గత సీజన్‌లో అతడి ఎంపికను సీపీఎల్ నిషేధించింది. ఇదే కారణంతో ఐపీఎల్ 2019లో కూడా అతడు ఆడలేదు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరోన్ పొలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు తరఫున తాంబే ఆడాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్.. టిన్‌బాగో జట్టుకు కూడా కో ఓనర్‌గా ఉన్నారు.

క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో:
ప్రవీణ్ తాంబే క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో ఇంకా ఆడుతున్నాడు. 2013 సీజన్‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ కనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. 2016లో ఆడకపోయినప్పటికీ.. 2017 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆపై కోల్‌కతా నైట్‌రైడర్స్ కనుగోలు చేసింది.
48 సంవత్సరాల వయసులో కూడా:
క్రికెట్ ఆటలో 30 ఏళ్ల చివరలో ఆటను కొనసాగించడం చాలా అరుదు. కానీ తాంబే మాత్రం 48 సంవత్సరాల వయసులో కూడా ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు. 2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన తాంబే.. 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున కూడా ఆడాడు.
IPL 2020: ముంబై, కోల్‌కతాలకు షాక్.. మరో వారం రోజులు క్వారంటైన్‌లోనే!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications