
దేశవాళీ రికార్డు
23 ఏళ్ల ప్రసిధ్ కృష్ణ దేశవాళీ క్రికెట్‌లో ప్రస్తుతం 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు. ఇప్పటివరకు భారత్ తరుపున 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 41 లిస్ట్-ఏ మ్యాచ్‌లతో పాటు 28 టీ20లు ఆడి వరుసగా 20, 67, 24 వికెట్లు పడగొట్టాడు. ఇవి మాత్రమే కాదు ఐపీఎల్(2018, 2019) సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

బుల్లెట్ వేగంతో బంతులు
చెన్నైలోని ఎమ్‌ఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో ప్రసిధ్ కృష్ణ రెగ్యులర్ ట్రైనీ బౌలర్. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ దగ్గరుండి మరీ అతడికి శిక్షణ ఇచ్చాడు. ఎక్సేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆస్ట్రేలియా మాజీ బౌలర్ జెఫ్ థామ్సన్ వద్ద శిక్షణ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి వచ్చాడు. 2018 విజయ్ హజారే ట్రోఫీ ప్రసిధ్ కృష్ణ జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. కర్ణాటక తరుపున 8 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు తీశాడు. ఫలితంగా ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో సౌరాష్ట్రకు చెందిన ధర్మేంద్ర జడేజా(7 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (7 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు.

ఐపీఎల్‌లో ప్రదర్శన
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రీ టోర్నమెంట్ మ్యాచ్‌ల కోసం బౌలర్‌గా ప్రసిధ్ కృష్ణను ఎంపిక చేసింది. అయితే, ఐపీఎల్ 2018 సీజన్‌లో కేకేఆర్ యొక్క అండర్-19 ఫాస్ట్ బౌలర్ కమలేష్ నాగర్‌కోటి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ ముంగిట రెండు ఆప్షన్లు మాత్రమే మిగిలాయి. ఒకటి ప్రసిధ్ కృష్ణతో పాటు ఎస్ ఆరవింద్‌లను జట్టులోకి తీసుకోవడం. దీంతో కేకేఆర్ యాజమాన్యం ప్రసిధ్ కృష్ణవైపు మొగ్గు చూపింది. దీంతో ఆ సీజన్‌లో ప్రసిధ్ కృష్ణ(7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు) తన అద్బుతమైన బౌలింగ్‌తో కేకేఆర్‌ను ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించాడు.

ప్రసిధ్ కృష్ణ ప్రదర్శనపై కోహ్లీ
కోహ్లీ మాట్లాడుతూ "భారత పేస్ దళంలో మంచి బౌలర్లు ఉన్నారు. ఒకే శైలిలో ఉండే బౌలర్లలో అనుభవం ఉన్న ఆటగాళ్లని తీసుకుంటాం. అయితే ఆస్ట్రేలియాకు (ప్రపంచకప్) కొత్తబౌలర్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఇది అందరికీ 'సర్‌ప్రైజ్ ప్యాకేజి'. అతడు మంచి పేస్, బౌన్స్ వేయగలడు. దేశవాళీ క్రికెట్‌లో ప్రసిధ్ కృష్ణ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే బౌలర్లందరూ అన్నిఫార్మాట్లో రాణిస్తుండటం సంతోషంగా ఉంది. ప్రపంచకప్‌కు ఉత్తమ జట్టును ఎంపిక చేయడానికి మాకు మంచి ఆటగాళ్లు ఉన్నారు" అని అన్నాడు. ప్రసిధ్ కృష్ణ పేరును కోహ్లీ ప్రస్తావించడంతో ప్రపంచకప్ జట్టు రేసులో అతడు కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications












