India vs England: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ.. 24 ఏళ్ల రికార్డ్ బ్రేక్!!

పూణే: మంగళవారం ఎమ్‌సీఏ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 317 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడే రెండో వన్డే జరుగనుంది.

మ్యాచ్‌ని మలుపు తిప్పే ప్రదర్శన:
తొలి వన్డేతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన పాతికేళ్ల ప్రసిద్ధ్ కృష్ణ.. మ్యాచ్‌ని మలుపు తిప్పే బౌలింగ్ ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46)ని ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ఆరంభించాడు. తన తర్వాతి ఓవర్లోనే ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను వెనక్కి పంపి భారత్‌లో ఉత్సాహం నింపాడు. ఆపై సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కరన్ (11) వికెట్లు తీశాడు. మ్యాచ్‌లో మొత్తం 8.1 ఓవర్లు బౌలింగ్ చేసిన ప్రసిద్ధ్.. 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రం వన్డేలో ఇప్పటి వరకూ ఏ భారత బౌలర్ కూడా నాలుగు వికెట్ల మార్క్‌ని అందుకోలేదు.

24 ఏళ్ల తర్వాత:
భారత్ తరఫున అరంగేట్రం వన్డేలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాని పరిశీలిస్తే.. 1997లో వెస్టిండీస్‌పై స్పిన్నర్ నోయల్ డేవిడ్ 3/21తో ఇప్పటి వరకూ టాప్‌లో ఉన్నాడు. 8 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు. తర్వాత స్థానాల్లో వరుణ్ అరోణ్ (3/24), హార్దిక్ పాండ్యా (3/31), పీయూస్ చావ్లా (3/37)లు ఉన్నారు. తొలి వన్డేలో 4 వికెట్లతో రాణించిన ప్రసిద్ధ్ కృష్ణ.. నోయల్ డేవిడ్‌ని వెనక్కి నెట్టి నెం.1 స్థానానికి ఎగబాకాడు. దాదాపు 24 ఏళ్ల పాటు నోయల్ అగ్రస్థానంలో ఉండటం విశేషం.

ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చుకున్నా:
మ్యాచ్ ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చుకున్న ప్రసిద్ధ్ కృష్ణ.. 15వ ఓవర్లో వికెట్ పడగొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. ఆపై ఎంతో ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాడు. పరుగులు ఇవ్వకుండా మరో మూడు వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో వన్డే అరంగేట్రంలో బెస్ట్ గణాంకాలు (8.1-1-54-4) ఇవే. ఈ పాతికేళ్ల బౌలర్ వల్లే ఐదేళ్ల తర్వాత ఓ వన్డే సిరీసును భారత్ విజయంతో ప్రారంభించిందని చెప్పడం అతిశయోక్తేమీ కాదు. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అరంగేట్రంలోనే మెరిసిన కృనాల్, ప్రసిద్ధ్:
తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచులోనే ఇద్దరూ సత్తాచాటారు. వన్డే అరంగేట్రంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా ప్రసిద్ధ్ నిలవగా.. అరంగేట్రంలో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాడిగా కృనాల్ (26 బంతుల్లో) రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు జాన్ మోరిస్ (35 బంతుల్లో,న్యూజిలాండ్) పేరిట ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఇంతకు ముందే చెప్పాం.. కసితో ఉండే ఆటగాళ్లను ప్రోత్సహిస్తాం! నిస్వార్థంగా సేవ చేసేవాళ్లకు అవకాశాలు ఇస్తాం: కోహ్ల