For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: సీఎస్కేకు బిగ్ షాక్: ఐపీఎల్‌కు ముందే ఊహించని దెబ్బ!

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రికార్డు స్థాయిలో రూ.14.20 కోట్లకు సీఎస్కే దక్కించుకున్న యువ సంచలనం, ఉత్తరప్రదేశ్ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్ రంజీ ట్రోఫీ ఆడుతూ గాయపడ్డాడు.

అసలేం జరిగిందంటే?

లక్నో వేదికగా జార్ఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న ప్రశాంత్ వీర్.. ఫీల్డింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. మ్యాచ్ 30వ ఓవర్లో మిడ్-ఆఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రశాంత్ వీర్.. ఒక బౌండరీని అడ్డుకునే క్రమంలో కుడివైపుకు డైవ్ చేశాడు. బంతిని ఆపినప్పటికీ.. ల్యాండింగ్ సమయంలో తన కుడి భుజం బలంగా నేలకు తగలడంతో తీవ్రమైన నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే మెడికల్ టీమ్ వచ్చి అతడిని స్ట్రెచర్‌పై బయటకు తీసుకెళ్లారు.

Prashant Veer Injury Update CSK All-Rounder Prashant Veer Injured During Ranji Trophy Match

మెడికల్ రిపోర్టు ఏం చెబుతోంది?

ఆస్పత్రిలో చేసిన స్కానింగ్‌లో ప్రశాంత్ వీర్ భుజానికి గాయం (Grade-2 Tear) అయినట్లు తేలింది. దీనివల్ల అతను సుమారు 3 నుంచి 4 వారాల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ప్రస్తుతం అతడు శనివారం తన ఇంటికి (అమేథీ జిల్లాలోని సహజీపూర్ గ్రామం) తిరిగి వెళ్తున్నాడు. అక్కడ 10-12 రోజుల విశ్రాంతి తర్వాత మెల్లగా ప్రాక్టీస్ ప్రారంభం కానుంది.

ఐపీఎల్ 2026కు అందుబాటులో ఉంటాడా?

ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ప్రశాంత్ వీర్ కోలుకోవడానికి కనీసం ఒక నెల సమయం పడుతుందని అంచనా. కాబట్టి ప్రశాంత్ వీర్ ఐపీఎల్ ప్రారంభ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రవీంద్ర జడేజాకు వారసుడిగా భావిస్తున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్‌పై సీఎస్కే యాజమాన్యం గట్టి నమ్మకంతో ఉంది.

Story first published: Saturday, January 24, 2026, 12:35 [IST]
Other articles published on Jan 24, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+