Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ జనరల్‌ మేనేజర్‌‌గా వెంకటేశ్‌ ప్రసాద్‌?

Prasad frontrunner for BCCI GM operations post

హైదరాబాద్: టీమిండియా మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్‌ ప్రసాద్‌ బీసీసీఐ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ (జీఎం)గా ఎంపికయ్యేలా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న వెంకటేశ్‌ ప్రసాద్‌ జీఎం పదవికి నవంబర్‌ 2న నిర్వహించే ఇంటర్యూకి హాజరు కానున్నారు.

'ఆ పదవికి అవసరమైన అన్ని అర్హతలు వెంకటేశ్‌ ప్రసాద్‌కు ఉన్నాయి. దాదాపుగా ఆయన్నే జీఎం పదవి వరించనుంది' అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత బీసీసీఐకి సంబంధించిన పలు హోదాల్లో వెంకటేశ్‌ ప్రసాద్‌‌కు పని చేసిన అనుభవం ఉంది.

భారత్ తరుపున తరుపున 1990ల్లో 33 టెస్టులాడిన వెంకటేశ్ ప్రసాద్ 96 వికెట్లు తీయగా... 161 వన్డేల్లో 196 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. ఇటీవలే కన్నుమూసిన హైదరాబాద్‌ మాజీ క్రికెటర్‌ ఎంవీ శ్రీధర్‌ 'పరస్పర విరుద్ధ ప్రయోజనల' నిబంధన వల్ల బీసీసీఐ జీఎం పదవికి రాజీనామా చేశారు.

అతడి రాజీనామాతో ఖాళీగా ఉన్న జీఎం పదవికి బీసీసీఐ నవంబర్ 2న ఇంటర్యూ నిర్వహించనుంది. ప్రస్తుతం వెంకటేశ్‌ ప్రసాద్‌ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బీసీసీఐ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ (జీఎం) పదవికి ఎంపికైతే ప్రస్తుతం తాను నిర్వహిస్తోన్న పదవికి రాజీనామా చేస్తారు.

Story first published: Tuesday, November 14, 2017, 13:28 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+