ఓ బ్యాట్స్ మన్ నిన్ను అధిగమిస్తాడు: కోహ్లీ గురించి సెహ్వాగ్‌కు ముందే
న్యూఢిల్లీ: టెస్టు కెప్టెన్‌గా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందిస్తున్న విరాట్ కోహ్లీ ఇప్పటికీ ఓ వ్యక్తికి భయపడతాడని వెల్లడించాడు. బుధవారం కోహ్లీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సీనియర్ క్రికెట్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి రచించిన 'డ్రైవెన్: ది విరాట్ కోహ్లీ స్టోరీ' పుస్తకావిష్కరణలో కోహ్లీ పాల్గొన్నాడు.
ఈ పుస్తకాన్ని క్రికెట్ మాజీ దిగ్గజాల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి కోహ్లీ, అతడి గురువు రాజ్‌కుమార్‌తోపాటు మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, అజయ్ జడేజా తదితురులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను కోహ్లీ వెల్లడించాడు. 1998 నుంచి రాజ్ కుమార్ శర్మే తన కోచ్‌గా ఉన్నారని, తానెప్పుడూ కోచ్‌ను మార్చే ప్రయత్నం చేయలేదని చెప్పాడు. కానీ, తప్పు చేస్తే కోచ్ నుంచి చీవాట్లు తినాల్సి వస్తుందని హడలిపోయేవాడినని కోహ్లీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.

కోచ్ అంటే అపారమైన గౌరవం
కోచ్ అంటే తనకున్న అపార గౌరవం కారణంగా ఆయన ఎన్ని మాటలన్నా ఇప్పటికీ మౌనమే తన సమాధానమని చెప్పాడు. అలాగే ఐపీఎల్‌లో తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి మాత్రమే ఆడానని, భవిష్యత్తులోనూ తన నిర్ణయం ఇదేనని స్పష్టంచేశాడు.

ఈ పుస్తకంలో కోహ్లీ గురించి తెలియని విషయాలు
ఈ పుస్తకం తన గురించి తెలియని విషయాలు, తన ఉన్నతికి కారణమైన వారి గురించి కూడా గొప్పగా చెబుతుందని కోహ్లీ అన్నాడు. డ్రైవెన్ పుస్తకంలో కోహ్లీ గురించి ప్రపంచానికి తెలియని విషయాలను రచయిత పరిచయం చేశాడని,
జూనియర్‌గా ఉన్నప్పుడు కోహ్లీ అందరి కంట్లో పడ్డాడని సెహ్వాగ్ అన్నాడు.

సెహ్వాగ్ చెప్పిన ఆసక్తికర విషయం
తాను టీమిండియాలో కీలక ఆటగాడిగా ఉన్న సమయంలో 'ప్రదీప్ సాంగ్వాన్ తన వద్దకు వచ్చి భయ్యా ఓ బ్యాట్స్ మన్ నిన్ను కచ్చితంగా అధిగమిస్తాడు. నీ రికార్డులను బ్రేక్ చేస్తాడని చెప్పాడు. అతడు మరెవరో కాదు విరాట్ కోహ్లీ' అని సెహ్వాగ్ వెల్లడించాడు.

కోహ్లీ ఫిట్‌నెస్ అతడి బలం: కపిల్
మా రోజులతో పోల్చుకుంటే కోహ్లీ ఫిట్‌నెస్ స్థాయి చాలా మెరుగ్గా ఉందని, మాకు కనీసం డిన్నర్ చేయడానికి డబ్బులు కూడా ఉండేవి కావన్నారు. కానీ ఇప్పుడు ఏం తినాలో ఆటగాళ్లే నిర్ణయించుకుంటున్నారని కపిల్ దేవ్ పేర్కొన్నాడు. కోహ్లీ ఫిట్‌నెస్ అతడి బలమని కపిల్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications